Saturday, March 1, 2025

ఆర్థిక కష్టాల్లో మంచి బడ్జెట్‌ అందించాం: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కష్టాల్లో కూడా మంచి బడ్జెట్‌ అందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. టిడిఎల్ పి సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసిపి హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. బడ్జెట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలని సలహా ఇచ్చారు. మళ్లీ సభకు రావాలనే భావనతో ఎమ్మెల్యేలు పనిచేయాలన్నారు. ఎంపిలు, ఎమ్మెల్యేలకు సమన్వయంతో ఉండాలని, గ్రూపు విభేదాలను సహించేది లేదని హెచ్చరించారు.

ఈసారి బడ్జెట్ లో పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు, మొత్తం 34,311 కోట్లు (గత ఏడాది కంటే రూ.2076 కోట్లు అధికం) కేటాయించడం ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధికి అద్దం పడుతోందన్నారు. రానున్న ఐదేళ్లలో ఎపి మోడల్ విద్యావ్యవస్థను తీసుకు రావాలన్న తన సంకల్పానికి బడ్జెట్ లో తాజాగా కేటాయించిన నిధులు దన్నుగా నిలుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. దీంతో ఎపి యువత అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆస్కారమేర్పడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News