Saturday, March 1, 2025

ఉచిత బస్సు హామీ ఏమైంది బాబు: బొత్స

- Advertisement -
- Advertisement -

అమరావతి: బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని వైసిపి నేత, మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ మండి పడ్డారు. ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ అని ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సిఎం చంద్రబాబు నాయుడు షూరిటీ కాదు.. మోసం అనాలని ధ్వజమెత్తారు. బడ్జెట్ కేటాయింపులు అరకొరగానే ఉన్నాయన్నారు. 81 లక్షల మంది విద్యార్థులకు 12 వేల కోట్లు కావాలని, కానీ 9400 కోట్లే కేటాయించారని… మిగిలిన నిధులు ఎలా ఇస్తారని బొత్స ప్రశ్నించారు. బడ్జెట్ లో మహిళలు, నిరుద్యోగుల ఊసే లేదని విమర్శించారు. ఉచిత బస్సు హామీ మాటే లేదని, ప్రజలను మాటలతో గారడీ చేసి, మోసం చేసే బడ్జెట్ అని బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News