Saturday, March 1, 2025

కీలక మ్యాచ్‌లో రెండు వికెట్లు కోల్పోయిన అఫ్గాన్

- Advertisement -
- Advertisement -

లాహోర్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గఢాఫీ స్టేడియం వేదికగా సెమీస్‌లో స్థానం కోసం ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకొంది. కానీ, తొలి ఓవర్‌లోనే రెహ్మానుల్లా గుర్బాజ్‌(0) స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కష్టాల్లో పడిన జట్టుకి ఇబ్రహీం జార్డన్, సెదికుల్లా అటల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశారు. రెండో వికెట్‌కి ఇరువురు కలిసి 70 పరుగులు జోడించారు. అయితే అడం జంపా బౌలింగ్‌లో ఇబ్రహీం జార్డన్(22), లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 17 ఓవర్లు ముగిసేసరికి అఫ్గానిస్థాన్ జట్టు 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజ్‌లో సెదికుల్లా అటల్(35), రహ్మత్ షా(6) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News