Saturday, March 1, 2025

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

నౌషెరా: పాకిస్థాన్‌ ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో శుక్రవారం రోజు బాంబు పేలుడు సంభవించింది. నౌషెరాలోని ఓ మదరసాలో ప్రార్థనలో జరుగుతున్నప్పుడు జరిగిన ఈ పేలుళ్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయగా.. 20 మందికిపైగా గాయపడ్డారు. అయితే దీన్ని ఆత్మహుతి దాడిగా పోలీసులు భావిస్తున్నారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ మాజీ సభ్యుడు మౌలానా హమీదుల్ హక్ హక్కానిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడిలో ఆయన కూడా మరణించినట్లు అధికారులు చెబుతున్నారు.

ఘటనస్థలికి చేరుకున్న రెస్య్కూ సిబ్బంది గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. ఈ దాడిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఇది ఒక హేయమైన, పిరికి చర్య అని ఆయన అన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News