Saturday, March 1, 2025

ఎస్‌ఎల్‌బిసి ఘటన విషాదాంతం.. మృతదేహాల గుర్తింపు!

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్‌: శ్రీశైలం లిఫ్ట్ బకింగ్ కెనాల్ (ఎస్‌ఎల్‌బిసి) ప్రమాదంలో చిక్కుకుపోయిన వారి కథ విషాదాంతం అయింది. ఏడో రోజు చిక్కుకుపోయిన ఎనిమిది మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతుల్లో ఆరుగురు కార్మికులు ఉండగా.. ఇద్దరు ఇంజినీర్లు ఉన్నారు. గత శనివారం ఎస్‌ఎస్‌బిసిలో ప్రమాదం జరిగి ఎనిమిది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. అప్పటి నుంచి అధికారులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ధ్వంసమైన టిబిఎం మిషిన్‌ను దక్షిణ మధ్య రైల్వే నిపుణులు గ్యాస్ కట్టర్ సహాయంతో తొలగించారు.

ఇక కార్మికుల జాడ కనిపెట్టేందుకు ‘గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్(జిపిఆర్)’ను అధికారులు సొరంగంలోకి ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో మూడు మీటర్ల లోతులో మృతదేహాలను గుర్తించారు. ఇప్పటివరకూ ఐదుగురి మృతదేహాలను గుర్తించిన అధికారులు మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ మృతదేహాలను వెలికి తీసేందుకు సమయం పడుతుందని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News