నిర్మాత కేదార్ మృతిపై ఇంకా మిస్టరీ కొనసాగుతుంది. కేదార్ ఎలా చనిపోయాడు? అనే దానిపైన పోలీసులు ఎటు తెల్చాలేక పోతున్నారు. దుబాయ్ లో తన ఫ్లాట్‌లో నాలుగు రోజుల క్రితం నిర్మాత కేదార్ చనిపోయాడు. ప్రాథమికంగా గుండెపోటు అని చెప్పినప్పటికీ అందుకు సంబంధించి అధికారికంగా పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత నివేదిక అనాలిసి స్ చేసిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దుబాయ్ పోలీసులు చెబుతున్నారు. మరో వైపు కేదార్ మృతిపైన రాజకీయ ప్రకంపనులు రేకెత్తుతున్నాయి. రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగుతోంది. సినీ నిర్మాతలతో పాటు కొంతమంది మాజీ ఎంఎల్‌ఎలు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. కేదార్‌ను నమ్ముకొని దాదాపు 100 కోట్ల పైగా డబ్బులను ఇవ్వడం జరిగింది. నలుగురు నిర్మాతలు సినిమా కోసం డబ్బులు ఇవ్వగా రాజకీయ నాయకులు దుబాయ్‌లో వ్యాపారం కోసం డబ్బులు ఇచ్చారు.
అయితే ఈ డబ్బులు ఇప్పుడు ఎలా తీసుకోవాలి? అనే దాని మీద సినీ నిర్మాతలు, రాజకీయ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఇద్దరు మాజీ ఎంఎల్‌ఎలు కేదార్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నారని చెబుతున్నారు. వీళ్లిద్దరి తోటి కలిసి క్రికెట్ మ్యాచ్‌తో పాటు ఒక వివాహానికి దుబాయ్‌లో కేదార్ అటెండ్ అయ్యారని తెలిసింది. తిరిగి ఒక మాజీ ఎంఎల్‌ఎతో కలిసి తన ఫ్లాట్ కి రావడం జరిగిందని చెబుతున్నారు. అదే రోజు రాత్రి కేదార్ చనిపోయాడు. ఆ తర్వాత కేదార్‌తో ఉన్న ఆ మాజీ ఎంఎల్‌ఎను పోలీసులు ఆరుగంటల పాటు విచారించి, తిరిగి ఇండియాకు పంపించి వేశారని అంటున్నారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యేలు మాత్రం తాము దుబాయ్ కి వెళ్లలేదని చెప్తున్నారు. ఇకపోతే హైదరాబాదులో తన పరపతి పూర్తిగా పెరిగిపోవడం దానికి తోడు అందరి దృష్టి తన పైన ఉండడంతో కేదార్ తన మకాం దుబాయ్‌కి మార్చి వేశాడు. భార్య, పిల్లల్ని ఇక్కడ పెట్టేసి వారంలో నాలుగు రోజులు దుబాయ్‌లోనే ఉండిపోతున్నాడు. అక్కడే వ్యాపారాలు చేస్తున్నాడు. చాలామందికి బినామీగా వ్యవహరిస్తు న్నాడు. పదిమంది మాజీ ఎమ్మెల్యేలకు కేదార్ బినామీగా ఉన్నట్టుగా చెప్తున్నారు.
అంతేకాకుండా నలుగురు నిర్మాతలకు కూడా కేదార్ బినామీగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. హైదరాబాదులో పబ్ బిజినెస్‌తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెద్ద ఎత్తున చేశాడు. ఆ సమయంలో పరిచయమైన అప్పటి ఎంఎల్‌ఎల తో కలిసి దుబాయ్‌తో పాటు బెంగళూరు, హైదరాబాద్ విజయవాడలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారా లను కేదార్ నిర్వహిస్తున్నాడు. కేదా ర్ మృతి అతి సాధారణమైనది అయితే పోలీసులు ఇప్పటికే మృతదేహాన్ని కుటుంబసభ్యులకి అప్పగించి ఉండేవారు. కానీ కేదార్ మృతి అనుమా నాస్పదంగా ఉండడంతో పోలీసులు డీటెయిల్‌గా పోస్టుమార్టం చేసి నివేదిక కోసం వెయిట్ చేస్తున్నారు. కేదార్ మృతిపైన పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే పోలీసులు కుటుంబ సభ్యులకు మృతి దేహాన్ని అప్పగించే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు కూడా కేదార్ మరణం రాజ కీయ – సినీవర్గాల్లో కలకలం సృష్టిస్తుంది.