- Advertisement -
రంగారెడ్డి జిల్లా, యాచారం మండల పరిధిలోని యాచారం అనుబంధ గ్రామం గాండ్లగూడలో ఇబ్రహీంపట్నం ఆర్‌టిసి డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కోరే అంజయ్య(45) గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే గమనించిన అతని కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగువారు అతనిని 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం అంజయ్య మృతి చెందాడు. పై అధికారుల ఒత్తిడి కారణంగానే మనోవ్యధకు గురై అంజయ్య ఆత్మహత్య చేసుకొన్నాడని తోటి ఉద్యోగులు ఆరోపించారు. ఆయన కుటుంబానికి తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
- Advertisement -