Saturday, March 1, 2025

పౌల్ట్రీ రైతులను పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్:హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

పౌల్ట్రీ రైతులకు మక్కలు, విద్యుత్ ను సబ్సిడీపై అందించింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆరేనని మాజీమంత్రి, ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చికెన్, ఎగ్‌మేళాలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌల్ట్రీ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చికెన్‌పై అపోహాలు వచ్చిన సమయంలో కెసిఆర్‌తో పాటు అప్పటి మంత్రులు ప్రజాప్రతినిధులంతా చికెన్, గుడ్డును తిని ప్రజలకు ఎంతో నమ్మకాన్ని కల్పించామని అన్నారు. కానీ ఈ ప్రభుత్వం ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న దృష్ప్రచారాలను తిప్పికొట్టడం లేదని, దీంతో ప్రౌల్టీ రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నారని అన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో సృష్టించే అపోహలను నమ్మవదన్నారు.

చికెన్‌ను బాగా ఉడకపెట్టి తింటే ఎలాంటి వైరస్ సోకదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్లూహెచ్‌ఓ)నే పేర్కొందన్నారు. 70 డిగ్రీల వరకు ఉడకపెడితే ఎలాంటి వైరస్ బతికి ఉండదన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చేది చికెన్, కోడిగుడ్డు మాత్రమేనని అన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో సృష్టించిన తప్పుడు ప్రచారాల వల్ల మాంసం ధరలు కొండకెక్కాయ్యాయని అన్నారు. రైస్, రోటీ కంటే చికెన్, గుడ్డ్డు ఆరోగ్యానికి మేలు అన్నారు. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద పౌల్ట్రీ వ్యవస్థ సిద్దిపేట జిల్లాలోనే ఉందన్నారు. గతంలో కెసిఆర్ ప్రౌల్టీ రంగాన్ని ప్రోత్సహించడంతో దేశంలోని సుమారు 12, 13 రాష్ట్రాలకు తెలంగాణ నుంచే కోళ్లు, గుడ్లు ఎగుమతి అయ్యేవన్నారు. కాంగ్రెస్ నిర్లక్షంతో నేడు ప్రౌల్టీ వ్యవస్థ్ధ సంక్షోబంలో కూరుకుపోతోందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కడవేర్గు రాజనర్సు, శ్రీహరి యాదవ్, ఎల్లారెడ్డి, పశు సంవర్ధక శాఖ వైద్యులు బాల సుందరం, వెంకట్ రెడ్డి, అబ్దుల్ వహీద్, భూసాని శ్రీను, శ్యాంరెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News