Saturday, March 1, 2025

ఎసిబి వలలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని కూలీలైన్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రూ.20 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఎసిబికి చిక్కారు. పాఠశాలలో కరాటే శిక్షణకు సంబంధించి రూ. 30 వేలు మంజూరు కాగా ఆ బిల్లును కరాటే మాస్టర్‌కు చెల్లించకుండా హెచ్‌ఎం తాటి రవీందర్ ఇబ్బందులకు గురిచేయడంతో కరాటే మాస్టర్ ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి…జిల్లా వ్యాప్తంగా 17 స్కూళ్లకు లేడీ కరాటే ఇన్‌స్ట్రక్టర్లకు 50 మందికి పైగా ఉన్న విద్యార్థులకు రూ.30 వేలు, 50 మంది కంటే తక్కువ ఉన్న విద్యార్థులకు రూ.15 వేల కింద సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే నేర్పించేందుకు ప్రభుత్వం కేటాయించింది. కరాటే నేర్పించినందుకుగాను ప్రభుత్వం పారితోషకం ఇస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాల కూలీలైన్ హెచ్‌ఎంగా విధులు

నిర్వహిస్తున్న రవీందర్ సదరు ఇన్‌స్ట్రక్టర్‌కు తరగతులు నిర్వహించేందుకు సమయం ఇవ్వకపోవడం, ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఫిబ్రవరిలో ఇప్పటివరకు ఎనిమిది క్లాసులు జరిగాయి. కరాటే నేర్పించేందుకు సమయం కేటాయించమని కోరినా కానీ సమయం కేటాయించకపోవడం, ఇబ్బందులకు గురిచేయడం, కరాటే చెప్పకపోయినా తాను సంతకం చేస్తాను.. బిల్లుపై సంతకం చేస్తాను.. అందులో రూ.10 వేలు తీసుకొని మిగిలిన రూ.20 వేలు తనకు ఇవ్వాలని హెచ్‌ఎం బేరసాలు చేశాడు. లేకపోతే వంద క్లాసులు చెబితేనే బిల్లులు పెట్టి డబ్బులు ఇస్తానని, లేకపోతే బిల్లు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ఈ వేధింపులు భరించలేక నిరాశకు గురైన లేడీ కరాటే ఇన్‌స్ట్రక్టర్ ఎసిబి అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు శుక్రవారం ఉదయం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో హెచ్‌ఎంకు రూ.20 వేలు లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి డిఎస్‌పి వై.రమేష్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News