- Advertisement -
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు బెదరింపులు వచ్చాయి. పాకిస్తాన్‌కు చెందిన ఫోన్ నంబర్ నుంచి ఈ బెదరింపులు వచ్చాయి. మహారాష్ట్ర అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం ముంబయి ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ ద్వారా బెదరింపు సందేశం వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ)ను పేల్చివేస్తామని అందులో హెచ్చరించారు. వాట్సాప్ సందేశం పంపిన వ్యక్తిని మాలిక్ షాబాజ్ హుమాయున్‌గా పేర్కొన్నారు. బెదరింపు నేపథ్యంలో ముఖ్యమంత్రి, సిఎం క్యాంప్ కార్యాలయం, వివిధ ప్రభుత్వ భవనాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
- Advertisement -