భేదాభిప్రాయాలు ఉంటే పార్టీలోనే
చెప్పాలి కష్టపడిన వారికి
తప్పకుండా పదవులు మండలాలు,
నియోజకవర్గాలవారీగా ఫీడ్‌బ్యాక్
తీసుకుంటాం మార్చి 10లోపు
ఇన్‌చార్జి మంత్రులు నివేదికలు ఇవ్వాలి
టిపిసిసి విస్తృతస్థాయి సమావేశంలో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ కోసం కష్టపడలేని ఎంతటి నేతనైనా పక్కన పెడతామని సిఎం రేవంత్ రెడ్డి పే ర్కొన్నారు. పైరవీల ద్వారా ప దవులు రావని ప్రోగ్రెస్ చూసి పదవులు వస్తాయని సిఎం అ న్నారు. పని చేసిన వారి జాబితాను కొత్త ఇన్‌ఛార్జీ సిద్ధం చేస్తారని ఆయన తెలిపారు. గాంధీ భవన్‌లో జరిగిన టిపిసిసి విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజన్‌తో పాటు సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొందరికి పదవులు రాలేదని సిఎం తెలిపారు. మొదటి విడతలో కార్పొరేషన్ చైర్మన్‌లకు రెండేళ్లు అవకాశం ఇచ్చామని, పని తీరు సరిగ్గా లేని వారిని కొనసాగించామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పనితీరు బాగాలేని వారిని ఇప్పుడు ఏమీ అనననీ, రెన్యువల్ కోసం వచ్చినప్పుడు చెబుతానని ముఖ్యమంత్రి తెలిపారు. పదవి వచ్చింది కదా అని కూర్చున్న వాళ్లకు ఇక కొనసాగింపు ఉండదని సిఎం రేవంత్ తేల్చి చెప్పారు. మార్చి 10వ తేదీ లోపు ఇన్‌ఛార్జీ మంత్రులు జిల్లాలకు వెళ్లి నివేదిక అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
ట్యాక్స్ కలెక్షన్‌లో తెలంగాణ టాప్
దేవాదాయ కమిటీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని సిఎం తెలిపారు. ఆ ఖాళీల భర్తీకి సంబంధించిన జాబితాను సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అందరికీ పదవులు ఇచ్చేద్దామని, అలాగే, పదవులు వచ్చిన వారు పదవి వచ్చింది తాను ఎందుకు పని చేయడం అనుకుంటున్నారని, పదవి రాని వారు, పదవి రాలేదు కదా తాము ఎందుకు పని చేయడం అని అనుకుంటున్నారని సిఎం రేవంత్ తెలిపారు. మంచిని మైక్‌లో చెప్పాలని, ఏదైనా సమస్య అంటే చెవిలో చెప్పాలని సిఎం రేవంత్ సూచించారు. గుజరాత్ మోడల్ సక్సెస్ మోడల్ కాదని, ప్రధాని మోడీ ప్రమోట్ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ట్యాక్స్ కలెక్షన్‌లో తెలంగాణ టాప్‌అని, ఆరో ప్లేస్‌లో గుజరాత్ ఉందని సిఎం తెలిపారు.
విదేశీ పెట్టుబడులు తెచ్చింది తెలంగాణ అని, వరి ధాన్యం పండించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం లేకుండానే కోటి 56 లక్షల టన్నులు పండించామని సిఎం రేవంత్ చెప్పుకొచ్చారు. అలాగే, రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసే వరకు కసి తగ్గొద్దని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాము కష్ట పడుతున్నామని మీరంతా కష్ట పడాలన్నారు. అనుకూల వాతావరణం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడాలని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇక, ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ ఘటన జరిగిన గంటలోనే మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అందరు అక్కడికి వెళ్లారని ఆయన తెలిపారు. రెస్య్కూ ఆపరేషన్ ను మంత్రులు దగ్గరుండి మరీ పరిశీలించారని చెప్పారు. ఇక, కాస్మోటిక్ చార్జీలు కెసిఆర్ పెంచలేదని, మనం పెంచామని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఏఐసిసి అనుమతితో త్వరలో మరిన్ని పదవులు
జెండా మోసిన 31 మందికి ఒక్క కలం పోటుతో పదవులు ఇచ్చామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఇంకా అవకాశం రాని అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారన్నారు. కలిసి పనిచేయడం వల్లే తెలంగాణలో అధికారంలో కి వచ్చామన్నారు. పార్టీ కట్టుబాట్ల గురించి మీనాక్షి నటరాజన్‌ను చూసి నేర్చుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రతి కార్పొరేషన్ పదవి కష్టపడ్డ కార్యకర్తకే ఇచ్చామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జెండా మోసిన కార్యకర్తలకు సముచిత స్థానం వస్తుందని, పైరవీల ద్వారా ఎప్పటికీ పదవులు రావని, ఏఐసిసి అనుమతితో త్వరలో మరిన్ని పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అసెంబ్లీ వారీగా ఫీడ్ బ్యాక్ తీసుకొని పదవులు ఇస్తామని సిఎం తెలిపారు. అనుభవజ్ఞులైన ఇద్దరిని రాజ్యసభకు కాంగ్రెస్ నామినేట్ చేసిందని, పార్టీ కార్యకర్తల కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఇస్తామని సిఎం తెలిపారు.