Saturday, March 1, 2025

స్వయం ఉపాధికి రూ. 6వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి క ల్పించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న అ నేక పథకాలకు బ్యాంకర్లు తమ వంతు స హకారం అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కోరారు. శుక్రవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రా వుతో కలిసి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకర్లనుద్దేశించి మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మై నారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రా ధాన్యత ఇచ్చి లక్షలాది మంది నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లుతుందని, బ్యాంకుల ద్వారా సుమారు రూ.6 వేల కోట్ల రుణాలు కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. అనేక పథకాల కింద లబ్దిదారులకు సబ్సిడీ లు, మార్జిన్ మనీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

మార్చి 2న సంక్షేమ పండుగ
సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమాలను ఒక పండుగలాగా నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. మార్చి 2వతేదీన వనపర్తిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్షే మ పథకాలనుప్రారంభించనున్నట్లు ఆ య న వెల్లడించారు. సమాజం లో సగభాగంగా ఉన్న మహిళలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెట్టుబడులకు బ్యాంకర్లు స హకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.రా ష్ట్రంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు,నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తు, శాంతిభద్రతలు మంచి వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ కృషి ఫలితంగా దావోస్ లో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామన్నారు.

సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లు
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా సమాంతరంగా పయనించాల్సిన అవసరా ఉందని, అందుకు అనుగుణంగా బ్యాంకర్ల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసి రూ.52వేల కోట్లు కేటాయించామని, మూడు నెలల వ్యవధిలోనే రైతు రుణమాఫీ కింద సుమారు రూ.21 వేల కోట్లు రైతుల ఖాతాలో జమచేసి రికార్డు సృష్టించినట్లు తెలిపారు. రైతు భరోసా కింద ఇప్పటికే రూ.11,500 కోట్లు, రైతు బీమా కింద రూ.1,500 కోట్లు, రైతులకు ఉచిత విద్యుత్తు పథకం సబ్సిడీ మొత్తం రూ.11 వేల కోట్లు, సన్నధాన్యం బోనస్ గా రూ.1,800 కోట్లు చెల్లించినట్లు భట్టి వివరించారు.

మూసీ మన బాధ్యత
మూసీ నదిని పునర్జీవింపజేయడం మనందరి బాధ్యతగా గుర్తించాలని ఉపముఖ్యమంత్రి కోరారు. మూసీ మురికిని పారదోలి పరిసరాల్లో నివసించే వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని, మూసీ నిర్వాసితులకు బ్యాంకర్లు ఆర్థికంగా ఆదుకోవాలని, వడ్డీలేని రుణాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు.
త్రిబుల్ ఆర్‌తో ఎంతో మార్పు
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఇండస్ట్రియల్, ఫార్మా, హౌసింగ్ క్లస్టర్లు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు భట్టి చెప్పారు. త్రిబుల్‌ఆర్ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కొన్ని ప్రాంతాలకు పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, కోటి మంది జనాభా ఉండే హైదరాబాద్ నగరంలో మహిళలకు ఆర్థిక చేయూతకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బ్యాంకర్లు ఆర్థిక చేయుత అందించాలని కోరారు.

పంటరుణాల్లో వెనుకంజ ః మంత్రి తుమ్మల
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ.21వేల కోట్ల రుణ మాఫీ చేసినప్పటికీ, బ్యాంకర్లు పంట రుణాల లక్ష్యాన్ని చేరు కోకపోవడంపట్ల విచారం వ్యక్తం చేశారు. రూ.90,795/- కోట్ల వ్యవసాయ రుణాలను లక్ష్యంగా నిర్దేశించుకుంటే డిసెంబర్ – 2024 వరకు కేవలం రూ.58,791/- కోట్లు మాత్రమేబ్యాంకులు రైతులకు పంట రుణాలు అందజేశాయని బ్యాంకుల వారిగా, శాఖల వారిగా పనితీరును సమీక్షించకపోవడం వల్లే పురోగతి మందగించిందన్నారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ పథకం క్రింద 4వేల యూనిట్లు మంజూరు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కేవలం 729 యూనిట్లు మాత్రమే మంజూరు చేశారు, రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్‌కు అపారమైన అవకాశాలు ఉన్నాయి.

మిర్చి, పసుపు, మొక్కజొన్న, పండ్లు ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లను ఇతోధికంగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల బ్యాంకర్లను కోరారు.మార్కెట్ యార్డ్ లలోని గోడౌన్ లలో రైతులు నిల్వ చేసుకున్న వాణిజ్య పంటలు, ఇతర పంట ఉత్పత్తులకు ఇచ్చే పోస్ట్ హార్వెస్టింగ్ లోన్స్ అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కేవలం మూడు బ్యాంకులు 32 మంది రైతులకి మాత్రమే రూ16.118 కోట్ల రుణాలు మంజూరు చేశారని వివరించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగుకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News