Saturday, March 1, 2025

ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌లో టెన్షన్…టెన్షన్

- Advertisement -
- Advertisement -

జాడను గుర్తించిన గ్రౌండ్ ప్రోబింగ్ రాడార్ యాంటీనా
బురదలో ఐదు మెత్తటి పదార్థాలను గుర్తించినట్లు
సమాచారం అవి మనిషి జాడలా..? ఏదైనా
మెత్తటి వస్తువులా..? కదలికలు లేనట్లు గుర్తింపు
ఆ 8 మంది బతికే అవకాశం లేదు : మంత్రి జూపల్లి
కృష్ణారావు తప్పుడు అంశాలను ప్రసారం చేయ
వద్దు : కలెక్టర్ బాదావత్ సంతోష్

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌లో టె న్షన్ టెన్షన్ నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం నేషనల్ జియోగ్రాఫికల్ సర్వే బృందం గ్రౌండ్ ప్రోబింగ్ రాడార్ యాంటీనా సహాయంతో టన్నెల్‌లో చిక్కుకున్న వారిని గుర్తించడానికి వెళ్లింది. జియోగ్రాఫికల్ స ర్వే బృందానికి రాడార్ ద్వారా అందిన సిగ్నల్స్ సర్వత్రా ఆందోళనకు గురిచేస్తున్నది. సొరంగంలో చిక్కుకున్న ప్రాంతానికి చేరుకుని రాడార్ తో పరిశీలించిన బృందానికి ఆసక్తికరమైన సిగ్నల్స్ అందినట్లు సమాచారం. 5 వేర్వేరుచోట్ల మెత్తటి వస్తువులు ఉన్నట్లు ఆ సిగ్నల్స్ ద్వారా తెలుసుకున్నట్లు సమాచారం. మొత్తం 8 మంది సొరంగంలో చిక్కుకోగా కేవలం 5 చోట్ల మాత్రమే మెత్తటి వస్తువులను గుర్తించడాన్ని బట్టి చూస్తే పలు అనుమానాలకు తావిస్తోంది. ఐదుగురు కార్మికులు కన్వేయర్ బెల్టులో మట్టిని ఎత్తిపోసే పనిలో ఉండగా మరో ముగ్గురు టిబిఎం ఆపరేటర్లు కావడంతో మిగతా ముగ్గురు టిబిఎంలో చిక్కుకుని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రాడార్‌కు అందిన సిగ్నల్ ఆధారంగా మనిసి కదలికలను కూడా గుర్తించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కదలికలు లేకపోతే వారు మట్టిలో చిక్కుకుని ఉండవచ్చనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సిగ్నల్స్‌ను గుర్తించి యంత్రాంగం ఈ అంశాన్ని గోప్యంగా ఉంచి రెస్కూను ముమ్మరం చేసి ర్యాట్ హోల్ మైనర్స్‌ను రంగంలో దించి సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా క్షణం క్షణం ఉత్కంఠకు దారితీస్తోంది.

తప్పుడు అంశాలను ప్రసారం చేయవద్దు ః కలెక్టర్ బాదావత్ సంతోష్
ఎస్‌ఎల్‌బిసి దుర్ఘటన నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కలెక్టర్ బాదావత్ సంతోష్ ఖండించారు. తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో కానీ పత్రికలు, ఛానల్లో కానీ ప్రసారం చేయవద్దని సూచించారు. సహాయక బృందాలు సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాయని తెలిపారు. సొరంగంలో ఐదుగురు మృతదేహాలను గుర్తించినట్లు వస్తున్న తప్పుడు వదంతులను నమ్మవద్దని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News