వరంగల్: ఎన్నో అడ్డంకులు అవహేళనలు ఎదుర్కొని తాను ఈ స్థాయికి వచ్చానని హాస్యనటుడు బ్రహ్మానందం తెలిపారు. తనకు మా నాన్న నేర్పిన మంచి మాటలు, మంచి పద్థతులతో వచ్చాను కాబట్టి ఇవాళ ఒక పద్మశ్రీ, ఒక డాక్టరేట్, ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీతగా మీ ముందు ఉన్నానని వివరించారు. వరంగల్ నగరంలోని నిట్ లో స్ప్రింగ్ స్ర్పీ 2025 జరిగిన మహోత్సవం కార్యక్రమంలో హాస్యనటుడు బ్రహ్మానందం ప్రసంగించారు. బ్రహ్మానందం హలో అనగానే విద్యార్థులు కేరింతలతో హోరెత్తించారు. విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు ఎదురైన మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తాను కాలేజీలో లెక్చరర్ గా పని చేశానని, లక్ష్యం పెట్టుకున్న సాధించేటపప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని సూచించారు. కృషి, పట్టుదలతోనే తాను ఈ స్థాయికి వచ్చానని, జీవితంలో ఎక్కడా రాజీపడకుండా ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. ‘నా అన్ని అత్యధిక సినిమాలు చేసినవాడు ఈ ప్రపంచంలోనే ఎవడూ లేడు’ అని బ్రహ్మానందం పేర్కొన్నారు.
నేనే అత్యధిక సినిమాలు చేశాను: బ్రహ్మానందం
- Advertisement -
- Advertisement -
- Advertisement -