Saturday, March 1, 2025

భార్య టీచర్…. భర్త డాక్టర్… ప్రియుడితో కలిసి చంపించింది

- Advertisement -
- Advertisement -

వరంగల్: ఓ పంతులమ్మ ప్రియుడి మోజులో పడిన తన భర్తను చంపించింది. ఈ సంఘటన వరంగల్ జిల్లాలోని బట్టుపల్లి సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్డు లో డాక్టర్ సుమంత్ రెడ్డి తన భార్య ప్లోరా మరియాతో కలిసి ఉంటున్నాడు. 2016లో డాక్టర్ సుమంత్ రెడ్డి ఫ్లోరా మరియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన బంధువుల విద్యా సంస్థలను చూసుకునేందుకు 2018లో సుమంత్ రెడ్డి తన భార్యతో కలిసి సంగారెడ్డిలో ఉంటున్నాడు. సంగారెడ్డి పిహెచ్‌సిలో అతడు వైద్యుడిగా సేవలందిస్తుండగా ఓ పాఠశాలలో ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఓ జిమ్‌కు వెళ్తున్న క్రమంలో ఫ్లోరాకు ట్రైనర్ శామ్యూల్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించి మకాం వరంగల్‌కు మార్చాడు. 2019 డిఎస్‌సిలో ఆమెకు టీచర్ జాబ్ రావడంతో పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కాలేజీలో అధ్యాపకురాలిగా పని చేస్తుంది. భర్తలేని సమయంలో ప్రియుడు శామ్యూల్‌ను ఇంటికి పిలుచుకొని రాసలీలలు కొనసాగించేంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు ఆమెను మందలించాడు. సుమంత్ రెడ్డి అడ్డు తొలిగించుకోవాలని తన ప్రియుడితో కలిసి ప్రియురాలు ప్లాన్ వేసింది. సైబరాబాద్‌లో పని చేస్తున్న ఎఆర్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌తో శామ్యూల్ ఒప్పందం చేసుకున్నాడు. ముందస్తుగా రూ.50 వేల రాజ్ కుమార్ తీసుకున్నాడు. ఫిబ్రవరి 20న రాత్రి కాజీపేటలోని ప్రైవేటు ఆస్పత్రి నుంచి సుమంత్ విధులు ముగించుకొని కారులో ఇంటికి వెళ్తున్నాడు.

బట్టుపల్లి సమీపంలో రాగానే ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించి బైక్ పై వచ్చారు. కారు వెనుక భాగంలో సుత్తితో కొట్టడంతో సుమంత్ కారు ఆపి కిందికి దిగాడు. వెంటనే వారు సుత్తెతో సుమంత్ తలపై పలుమార్లు కొట్టారు. సుమంత్ మృతి చెందాడని భావించి అక్కడి నుంచి వారు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సుమంత్‌ను స్థానికులు ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. సుమంత్ తండ్రి సుధాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిసి ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఇంట్లోని బంగారం అమ్మేందుకు వెళ్తున్న శామ్యూల్, ఫ్లోరా, రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News