Saturday, March 1, 2025

అప్పుడే ఆ వ్యాధి ఉందని తెలిసింది: దీపికా పదుకొణె

- Advertisement -
- Advertisement -

ముంబయి: గతంలో తాను మానసిక ఒత్తిడికి తీవ్రంగా గురయ్యాని బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తెలిపారు. కెరీర్‌లో దూసుకెళ్తున్న సమయంలో తీవ్ర ఆలసటకు గురికావడంతో మానసిక ఒత్తిడి అని తెలుసుకున్నానని వివరణ ఇచ్చారు. ఓ మ్యాగజైన్ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడారు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి ఎక్కువగా ఏడ్చేసేదానని, అప్పుడు తాను మానసిక రుగ్మతతో బాధపడుతున్నానని తెలియజేశారు. వెంటనే నిపుణుల సమక్షంలో చికిత్స తీసుకున్నానని వివరణ ఇచ్చారు. మానసిక ఆరోగ్యం గురించి దీపకా పలుమార్లు అవహగాన కల్పిస్తున్న విషయం తెలిసిందే. తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ తనకు ఇష్టమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పారు.

దీపికా పదుకొణె నటించిన జవాన్, కల్కి 2898 ఎడి, పఠాన్, పద్మావత్, చెన్నైఎక్స్‌ప్రెస్, పైటర్, హ్యాపీ న్యూఇయర్, యే జవానీ హైదీవానీ, బాజీరావ్ మస్తానీ, గోలియోన్ కీ రాస్లీలా రామ్ లీలా వంటి సినిమాలు అత్యధిక వసూళ్లు రాబట్టాయి. ఆమెకు ఈ సినిమాలు మంచి ప్రేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News