- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే మోసమని మరోసారి రుజువైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. బడ్జెట్ ద్వారా ప్రజలకు నిరాశే మిగిలిందని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఎన్నికల్లో ఇచ్చిన హామిలు వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చారని చెప్పారు. ఎపి ప్రభుత్వ బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచిందని, చంద్రబాబు చేసిన మొదటి సంతకానికి దిక్కులేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. కూటమి పాలనపై ప్రజలు తిరగబడే పరిస్థితి ఏర్పడిందని అమర్నాథ్ స్పష్టం చేశారు.
- Advertisement -