Sunday, March 2, 2025

అవాస్తవాలు రుద్దితే ఒరిగేదేమీ ఉండదు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అబద్ధాలు చెప్పినంత మాత్రాన కాంగ్రెస్ పై వ్యతిరేకత పోదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజలు తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్ మాటలు నమ్మే పరిస్థితి లేరని చెప్పారు. నాంపల్లిలో భాజాపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నిధులు ఇవ్వడంలో ఓ విధానం ఉంటుందని, తెలంగాణలో కేంద్రం  రూ. 10 లక్షల కోట్ల విలువైన పనులను చేపట్టిందనన్నారు. రేవంత్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రంతో మాట్లాడుతూనే ఉన్నా.. తనపై అవాస్తవాలు రుద్దితే కాంగ్రెస్ కు ఒరిగేదేమీ ఉండదని ధ్వజమెత్తారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునే యత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News