Sunday, March 2, 2025

మర్యాదగా డిలీట్ చేయండి.. అనిల్ రావిపూడి వార్నింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో వరుస హిట్లతో దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి. ఆయన ఇప్పటివరకూ చేసిన ప్రతీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యాయి. ఇక తాజా విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు చేసి.. సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంత సక్సెస్ వస్తుందో.. అంతే కాంట్రవర్సీ కూడా వస్తుంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు అనిల్‌ రావిపూడి కూడా ఎదురుకుంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోయిన్‌గా నటించిన మీనాక్షి చౌదరికి ఆయనకి మధ్య కెమిస్ట్రీ ఉందంటూ.. యూట్యూబ్‌లో ప్రచారం జరగడం ఆయన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో తాను హీరోగా చేసే అవకాశం ఉందని అన్నారు. దీని వెంటనే ఆ యాంకర్ హీరోయిన్‌గా ‘మీనాక్షీని పెట్టుకోండి.. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుటుంది’ అంటూ కామెంట్ చేశారు. దీని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ మధ్య కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఏమీ లేవు అని తానేదో ప్రశాంతంగా సినిమాలు చేస్తుంటే.. యూట్యూబ్‌లో అందమైన వాయిస్ ఓవర్‌తో ఇష్టమొచ్చినట్లు రాస్తున్నారని మండిపడ్డారు. ఆ వీడియోలను మా బంధువులు, ఆత్మీయులు చూసి వాటిని నా భార్యకు పంపి అనిల్‌ గురించి ఇలాంటి కథలు రాస్తున్నారేంటని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి ఇప్పటికే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, కాబట్టి మర్యాదగా ఆ వీడియోలు తొలగించకపోతే.. మిమ్మల్నే బ్లాక్ చేస్తారని హెచ్చరించారు. ఇకపై తనపైనే కాదు.. ఇంకెవరిపై కూడా ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయకండి అంటూ.. ఆయన హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News