Sunday, March 2, 2025

15 ఏళ్లు దాటిన వాహనాలకు పెట్రోల్ బంద్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఢిల్లీ నగర వ్యాప్తంగా ఇంధన స్టేషన్లలో ఈ నెల 31 తరువాత పెట్రోల్ సరఫరాను ఢిల్లీ ప్రభుత్వం నిలిపివేస్తుందని పర్యావరణ శాఖ మంత్రి మన్‌జిందర్ సింగ్ సిర్సా శనివారం ప్రకటించారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యం నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు అధికారులతో సమావేశమైన సిర్సా వాహనాల నుంచి వెలువడే పొగలు, కాలుష్యం కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని వెల్లడించారు. పాత వాహనాలపై ఆంక్షల, పొగమంచు నివారణకు నిర్బంధ చర్యలు, ప్రభుత్వ రవాణా సంస్థ విద్యుత్ బస్సులకు మారడం సహా కీలకమైన విధాన నిర్ణయాలపై సమావేశంలో చర్చించారు.

’15 ఏళ్లు దాటిన వాహనాలను గుర్తించేందుకు పెట్రోట్ బంకుల్లో పరికరాలు అమరుస్తున్నాం. వాటిలో ఇక ఎంత మాత్రం పెట్రోల్ నింపరు’ అని సమావేశం అనంతరం సిర్సా తెలియజేశారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం గురించి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖకు సమాచారం అందజేస్తుందని ఆయన చెప్పారు. ఢిల్లీలో ప్రభుత్వ సిఎన్‌జి బస్సుల్లో సుమారు 90 శాతానికి ఈ ఏడాది డిసెంబర్ కల్లా స్వస్తి చెప్పనున్నట్లు, వాటి స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు సిర్సా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News