Wednesday, April 23, 2025

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ చేయాలన్న సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్మాత్మికతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయని సిఎం రేవంత్ తెలిపారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిస్తోందన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ముస్లింల అభ్యున్నతికి తోడ్పడే కార్యక్రమాలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, అల్లా దీవెనలు పొందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News