నలుగురి మృతదేహాలు గుర్తింపు
మరో నాలుగు టిబిఎం పరిసరాల్లో
ఉన్నట్లు సమాచారం మృతదేహాలకు
నష్టం జరగకుండా సహాయక
చర్యలు అంబులెన్స్‌ల
మోహరింపు తాజా పరిస్థితులను
సమీక్షించిన మంత్రులు ఉత్తమ్,
జూపల్లి, సిఎస్ నేడు టన్నెల్
ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం
మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో చిక్కుకున్న 8 మంది మృ తి చెందినట్లు అధికారులు ఒక అంచనాకు వ చ్చారు. గత నెల 22వ తేదీ ఉదయం సొరంగం కప్పు భాగం కూలిన విషయం విధితమే. శుక్రవారం మధ్యాహ్నం రాడార్ స్కానింగ్ ద్వారా టి బిఎం వెనుకభాగంలో 4 మృతదేహాలను గుర్తించారు. మిగతా నలుగురి మృతదేహాలు టిబిఎం మిషన్ ఆపరేటింగ్ క్యాబిన్ లోపల లేక పరిసరాలలో ఉం డి ఉంటాయని భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి మృతదేహాలు బయటికి తీస్తారన్న ప్రచారం విస్తృతంగా జరిగిం ది. రెస్కూ ఆపరేషన్ జరుగుతోందని జిల్లా కలెక్టర్ ప్రకటించిన విషయం విధితమే. ఇదిలా ఉండగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సిఎస్ శాంతి కుమారి శనివారం ఉదయం 11 గంటలకు దోమలపెంటకు చేరుకుని ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ వద్ద పరిస్థితులను స మీక్షించారు. సహాయక బృందాలు మృతదేహాలు ఉన్నట్లు వారి దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ఇదిలాఉండగా సొ రంగంలో సహాయక చర్యలు చేపడుతున్న బృందాలకు కూలిన సొరంగ మార్గం నుంచి మట్టి, బురదతో పాటు నీ టిలో శవాల డీ కంపోస్టుకు సంబంధించిన వాసన వస్తుండడాన్ని గమనించినట్లు సమాచారం.
మరోవైపు సొరంగ మార్గంలో హిటాచీలు, ఇతర యంత్ర పరికరాలు వినియోగిస్తూ మట్టి, రాళ్లను తొలగించే పనులు చేపడుతున్నా రు. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది మృతి చెం దారన్న సంకేతాలు రాడార్ ద్వారా తెలుసుకోవడం ద్వారా ఆలస్యమైనా మృతదేహాలకు ఎలాంటి నష్టం జరగకుండా అవయవాలను మిషనరీ ద్వారా నష్టం జరుగకుండా బయటకి తీయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రికి నలుగురి మృతదేహాలు బయటపడే అవకాశాలు కనిపిస్తుండగా ఆదివారం సాయంత్రానికి టిబిఎంలో చిక్కుకున్న మిగతా వారి మృతదేహాలు సైతం బయటకుతీసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి సహాయక బృందాలు అధికార యంత్రాంగం సొరంగంలో చిక్కుకున్న వారంతా మృతి చెందారని ఒక అంచనాకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇదిలాఉండగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సిఎస్ శాంతి కుమారి ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌లో జరుగుతున్న సహాయక చర్యలపై శనివారం సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు, శిథిలాల తొలగింపు, డీ వాటరింగ్ పనుల పురోగతిపై రెస్కూ టీం, ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.
అంబులెన్స్‌ల మోహరింపు
మృతదేహాలను వెలికి తీసిన వెంటనే నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి వారి వారి స్వగ్రామాలకు తరలించడానికి ప్రైవేట్ ఏజెన్సీలకు చెందిన ఫ్రీజర్లతో కూడిన అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. జిల్లా కేంద్రంలోని ఒకచోట అంబులెన్స్‌ను మోహరించారు. అంబులెన్స్ డ్రైవర్లను ఇక్కడికి వచ్చిన విషయం గురించి అడుగగా శ్రీశైలం వద్ద జరిగిన ప్రమాదంలో మృతదేహాలను జార్ఖండ్, యుపి, పంజాబ్‌లకు తరలించడానికి వచ్చినట్లు తెలిపారు.