Monday, March 3, 2025

తగ్గిన జెలెన్‌స్కీ

- Advertisement -
- Advertisement -

అమెరికాతో ఖనిజ ఒప్పందానికి
ఓకే ట్రంప్‌తో వాగ్వాదం తరువాత
మనసు మార్చుకున్న ఉక్రెయిన్
అధ్యక్షుడు సెక్యూరిటీ గ్యారెంటీలు
లేకుండా రష్యాతో కాల్పుల విరమణ
తమకు ప్రమాదకరమన్న జెలెన్‌స్కీ
ఐరోపా దేశాల సంఘీభావం
ఉక్రెయిన్‌కు చెంపపెట్టు : రష్యా

కీవ్ : అమెరికా లోని శ్వేతభవనంలో శు క్రవారం అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అ యినప్పుడు తన పోరాట స్వరంతో ప్ర కంపనలు సృష్టించిన ఉక్రెయిన్ అధ్యక్షు డు జెలెన్‌స్కీ ఎట్టకేలకు శనివారం ఖనిజ ఒప్పందానికి సిద్ధమయ్యారు. శుక్రవా రం భేటీలో ఖనిజ ఒప్పందంపై అమెరి కా, ఉక్రెయిన్ దేశాల మధ్య సంతకాలు జరుగుతాయని అనుకున్నా , భేటీ వాడి గా, వేడిగా సాగడంతో అర్ధంతరంగా జె లెన్‌స్కీ నిష్క్రమించారు. అయితే ఖనిజ పంపద ఒప్పందానికి సిద్ధమేనని తాజా గా జెలెన్‌స్కీ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఒప్పందం ఉక్రెయిన్ భద్రతకు హామీ ఇచ్చేందుకు తొలి అడుగు అవుతుందని ప్రకటించారు. ఈ ఒప్పందం ఉక్రెయిన్, అమెరికా దేశాల మధ్యఆర్థిక, రక్షణ సంబంధాలను మ రింత బలోపేతం చేస్తుందన్నారు.‘అయి తే ఇది ఒక్కటే సరిపోదు. భద్రతా హా మీ లు లేకుండా రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందం ఉక్రెయిన్‌కు చాలా ప్ర మాదకరం. గత మూడేళ్లుగా మేము పోరాడుతున్నాం.

అమెరికా తమ వైపే ఉందని ఉక్రెయిన్ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది” తన ఎక్స్ ద్వారా తెలియజేశారు. ‘ఉక్రెయిన్ ఆవేదనను అందరూ వినాలి. ఎవరూ విస్మరించరాదు. యుద్ధం లోనే కాదు, ఆ తరువాత కూడా ’అని వివరించారు. రష్యాతో తాము సాగిస్తున్న యుద్ధానికి అమెరికా అందిస్తున్న సాయానికి ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే అమెరికా కాంగ్రెస్, అమెరికా ప్రజలు ద్వైపాక్షిక మద్దతు అందించారని ప్రశంసించారు. అమెరికా అందిస్తున్న సాయానికి , ప్రత్యేకించి గత మూడేళ్లుగా పూర్తికాల దాడులతో రష్యా సాగిస్తున్న యుద్ధంలో అన్ని విధాలా అందుతున్న సాయానికి ఉక్రెయిన్ ప్రజలు నిత్యం అమెరికాను అభినందిస్తుంటారని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ రక్షణ ప్రయత్నాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదమే యుద్ధ గమనానికి నిర్ణయాత్మకమవుతుందని వివరించారు. ‘ట్రంప్ సాయం తమకు ఎంతో కీలకం. ఆయన యుద్ధం పరిసమాప్తం కావాలని ఆకాంక్షిస్తున్నారు. కానీ తమకు మించి మరెవరూ శాంతిని కోరుకోవడం ఇది స్వేఛ్చాస్వాంతత్య్రాల కోసం సాగుతున్న సమరం. మా మనుగడ కోసం సాగిస్తున్నాం’ అని ఎక్స్ పోస్ట్‌లో నిన్నటి శ్వేతభవనం సమావేశం ఫోటో జత చేసి పెట్టారు.

ఉక్రెయిన్ పోరాటానికి ఐరోపాదేశాల సంఘీభావం
శ్వేతభవనం లోని అధ్యక్షుడు ట్రంప్‌కు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి భేటీ సందర్భంగా వాడి, వేడి వాగ్వివాదాలు సాగడం, జెలెన్‌స్కీని అవమానించేలా తక్కువ చేయడం తదితర అనూహ్య పరిణామాలు ఉక్రెయిన్ మద్దతు ఐరోపా భాగస్వామ్య దేశాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు కలిగించాయి. ఐరోపా దేశాలతో పాటు ప్రపంచం లోని మిగతా దేశాలు కూడా జెలెన్‌స్కీకి ధైర్యం కల్పిస్తూ తామంతా అండగా ఉన్నామని సంఘీభావం ప్రకటించాయి. జెలెన్‌స్కీ ఎక్స్ ఖాతా అంతా మద్దతు సందేశాలతో నిండిపోయింది. దీనికి జెలెన్‌స్కీ ఆయా దేశాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. “ ఉక్రెయిన్ ప్రజల శౌర్యాన్ని మీ ఔన్నత్యం గౌరవిస్తోందని, దృఢంగా, సాహసంగా, నిర్భయంగా ముందడుగు వేయండి. మీరు ఒంటరివారు కాదు. మీ దేశానికి శాంతి లభించేవరకు మీతోనే కలిసి పనిచేస్తాం ” అని యూరోపియన్ ప్రెసిడెంట్ యుర్సులా వాన్ డెర్ లెయెన్ తన ఎక్స్ పోస్టులో తెలియజేశారు. శుక్రవారం ఆమె భారత్ పర్యటనలో ఉన్నారు. “ గత మూడేళ్లుగా ఉక్రెయిన్ ప్రజలు ధైర్యసాహసాలతో తమ స్వాతంత్య్రం కోసం, ప్రజాస్వామ్యం కోసం, సాధికారత కోసం రష్యాకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు.

ఇది మనందరి సమస్య. శాంతి సాధించేవరకు కెనడా ఎప్పుడూ ఉక్రెయిన్‌కు మద్దతుగానే ఉంటుంది.” అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ తన ఎక్స్ పోస్టులో “దురాక్రమణదారుడు రష్యా, బాధితుడు ఉక్రెయన్. ఉక్రెయిన్‌కు సహాయం చేయడం తమ విధి. మూడేళ్ల క్రితమే రష్యాపై ఆంక్షలు విధించాం. ఇంకా కొనసాగిస్తాం. మా పక్షాన అమెరికన్లు, యూరోపియన్లు, కెనడియన్లు, జపనీస్ ఉన్నారని నమ్ముతాం. గౌరవం కోసం, స్వేచ్ఛకోసం, ఐరోపా భద్రత కోసం మొదటి నుంచి యుద్ధంలో పాల్గొంటున్న వారిని గౌరవించాలి ” అని పేర్కొన్నారు. గత సోమవారం మేక్రాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలుసుకుని ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ట్రంప్‌కు అత్యంత మిత్రులైన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దౌత్యపరమైన విధానం తిరిగి సరైన గాడిలో పడేందుకు ఐరోపా యూనియన్ అమెరికా కూటమి సదస్సుకు పిలుపునిచ్చారు. ఈరోజు ఎదురవుతున్న పెద్ద సవాళ్లను ఎలా పరిష్కరించాలో స్పష్టంగా చర్చించడానికి ఈ సదస్సుఅవసరమన్నారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌తో మనం సమర్థించడం ప్రారంభించామని చెప్పారు. జర్మనీ తదుపరి ఛాన్సలర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్ ఈ పరీక్షాకాలంలో తాము ఉక్రెయిన్‌కు అండగా ఉంటామన్నారు. ఎస్టోనియా, ఫిన్లాండ్, లాట్వివా ఎడ్గార్స్, లక్సెంబర్గ్, పోలిష్ దేశాల ప్రతినిధులు ఉక్రెయిన్‌కు మద్దతుగా తమ సందేశాలు జెలెన్‌స్కీకి పంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News