రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసిన విషయంలో కొన్ని
ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఆయన పర్యటనను ఎద్దేవా చేస్తూ వెకిలి
వ్యాఖ్యానాలు చేయడం కూడా విన్నాం, చూసాం. రాష్ట్రానికి కావలసిన విషయాలను
అడగడానికి రేవంత్ రెడ్డి వెళ్తే రాష్ట్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉల్టా ఒక నోట్ ముఖ్యమంత్రికి ఇస్తే ఆయన చిన్నబోయి తిరిగి వచ్చారని కూడా ప్రచారం జరిగింది.
ఇవన్నీ 2017 నుంచి 2022 వరకు పెండింగ్‌లో ఉన్న అంశాలు. అప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నది ఎవరు? ముఖ్యమంత్రికి ప్రధాని ఝలక్ ఇచ్చారని రాసిన పత్రిక యజమాని అయిన భారత రాష్ట్ర సమితి కాదా అప్పుడు అధికారంలో ఉన్నది? ప్రభుత్వం అనేది కొనసాగింపు కాబట్టి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ నోట్
ఇవ్వడంలో తప్పులేదు. దాన్ని అమలు చేస్తానని ముఖ్యమంత్రి చెప్పడంలో కూడా తప్పులేదు. కానీ ఇదంతా ఏదో రేవంత్ రెడ్డిని అవమానించడానికి ప్రధానమంత్రి చేసిన వ్యవహారం అన్న విధంగా చూపబోయి ప్రతిపక్షం బొక్కబోర్లా పడింది.
రాజకీయాల సంగతి అలా ఉంచితే తెలంగాణలో ఇంకొక విమానాశ్రయం.. అది కూడా
వరంగల్లో అంతర్జాతీయస్థాయిలో రావడాన్ని అందరూ ఆహ్వానించాల్సిందే. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఇప్పటివరకు ఒకటే ఒక విమానాశ్రయం ఉండటం గమనార్హం. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లో, తెలంగాణకంటే చాలా చిన్నవైన రాష్ట్రాల్లో కూడా ఒకటికి మించి విమానాశ్రయాలు ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి. అందులో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు.
తెలంగాణ పరుగు ఆగదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ సిఎల్ నూతన క్యాంపస్ ప్రారంభోత్సవంలో ప్రకటించిన 24 గంటల్లోనే ఆ పరుగును మరింత వేగవంతం చేసే ఒక అద్భుతమయిన నిర్ణయం కేంద్ర పౌర విమానయాన శాఖ ఉత్తర్వుల ద్వారా వెలువడటం విశేషం. వరంగల్ పట్టణ శివార్లలోని మామునూరువద్ద విమానాశ్రయం పునఃప్రారంభించడానికి పౌర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఓ నలభై ఎనిమిది గంటల ముందు అనుకుంటాను ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు క్లియర్ చేయవలసిందిగా కోరారు. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసిన విషయంలో కొన్ని ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఆయన పర్యటనను ఎద్దేవా చేస్తూ వెకిలి వ్యాఖ్యానాలు చేయడం కూడా విన్నాం, చూసాం. రాష్ట్రానికి కావలసిన విషయాలను అడగడానికి రేవంత్ రెడ్డి వెళ్తే రాష్ట్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలగురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉల్టా ఒక నోట్ ముఖ్యమంత్రికి ఇస్తే ఆయన చిన్నబోయి తిరిగి వచ్చారని కూడా ప్రచారం జరిగింది.
రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి అధికార పత్రికలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన మీద ‘మోడీ ఝలక్ సీఎం షాక్, నోట్ ఇచ్చి మరీ నిలదీసిన ప్రధాని, అవాక్కైన రేవంత్, తొమ్మిది అంశాలపై ఆయనకే రివర్స్ నోట్ అందించిన మోడీ, ఓ సీఎంతో సమావేశం సందర్భంగా ప్రధాని ఇలా రివర్స్ నోట్ ఇవ్వడం తొలిసారి అంటున్న విశ్లేషకులు’ వంటి శీర్షిక, ఉపశీర్షికలతో ఒక ప్రధాన వార్తను ప్రచురించింది. ఇంతకూ ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రికి ఇచ్చిన నోట్‌లో ఏముంది? ఆరు పెండింగ్ అంశాలమీద ముఖ్యమంత్రికి ప్రధాని నోట్ ఇచ్చారు. వాటిమీద దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి సూచించారు. ప్రధాని ఆవాస్ యోజన గ్రామీణ పథకం అమలు చేయాలని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లకు అనుమతులు, దేవాదుల, బీమా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారం ఇందులో ప్రస్తావించారు. బీబీనగర్ ఎయిమ్స్‌కు 1365.95 కోట్ల రూపాయలు చెల్లించాలని, శంషాబాద్ లో ఇఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి రూ. 150 కోట్లు ఇవ్వాలని సూచించారు. ప్రాజెక్టు అంచనాలను సవరించి పంపాలని మోడీ సూచించగా పెండింగ్ ప్రాజెక్టులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సిఎం హామీ ఇచ్చారు. ఇవన్నీ 2017 నుంచి 2022 వరకు పెండింగ్‌లో ఉన్న అంశాలు.
అప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నది ఎవరు? ముఖ్యమంత్రికి ప్రధాని ఝలక్ ఇచ్చారని రాసిన పత్రిక యజమాని అయిన భారత రాష్ట్ర సమితి కాదా అప్పుడు అధికారంలో ఉన్నది? ప్రభుత్వం అనేది కొనసాగింపు కాబట్టి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ నోట్ ఇవ్వడంలో తప్పులేదు. దాన్ని అమలు చేస్తానని ముఖ్యమంత్రి చెప్పడంలో కూడా తప్పులేదు. కానీ ఇదంతా ఏదో రేవంత్ రెడ్డిని అవమానించడానికి ప్రధానమంత్రి చేసిన వ్యవహారం అన్న విధంగా చూపబోయి ప్రతిపక్షం బొక్కబోర్లా పడింది.ఇది జరిగిన రెండు రోజుల్లోనే కేంద్ర పౌర విమానయాన శాఖ వరంగల్‌లో విమానాశ్రయం పునరుద్ధరణకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం గమనించాల్సిన విషయం. ఇక ముఖ్యమంత్రిని ప్రధాని అవమానించి పంపారని పతాక శీర్షికలో రాసిన ఆ పత్రిక మామునూరు విమానాశ్రయానికి కేంద్రం అనుమతి ఇచ్చిందన్న వార్తను మాత్రం లోపలి పేజీల్లో ఎక్కడో కనపడీ కనపడకుండా ప్రచురించింది. అంతేకాదు, దాంతోపాటు ఇదంతా భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న కాలంలో కె.టి. రామారావు చేసిన ప్రయత్నాల కారణంగా జరిగిందని కూడా రాసుకున్నది.
భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ప్రధాన భూమిక నిర్వహించి, ముఖ్యమంత్రి తర్వాత అంతటి వ్యక్తిగా వ్యవహరించిన కె.టి. రామారావు అప్పట్లో ఆ ప్రయత్నం చేసి ఉండవచ్చు, కాదని ఎవరూ అనరు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రయత్నాల్లో భాగంగా వచ్చిన నిర్ణయాన్ని ఆమోదించే విశాల హృదయం లేకపోవడం విచారకరం.
సరే, రాజకీయాల సంగతి అలా ఉంచితే తెలంగాణలో ఇంకొక విమానాశ్రయం.. అది కూడా వరంగల్లో అంతర్జాతీయ స్థాయిలో రావడాన్ని అందరూ ఆహ్వానించాల్సిందే. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఇప్పటివరకు ఒకటే ఒక విమానాశ్రయం ఉండటం గమనార్హం. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లో, తెలంగాణకంటే చాలా చిన్నవైన రాష్ట్రాల్లో కూడా ఒకటికి మించి విమానాశ్రయాలు ఉన్నాయి.10 సంవత్సరాల క్రితం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి. అందులో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు. తెలంగాణ కంటే విస్తీర్ణంలోనూ, జనాభాలోనూ చిన్నదైన కేరళ రాష్ట్రంలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇలా ఇంకా చిన్న ప్రాంతాల్లో కూడా అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉండడానికి సరయిన కారణాలు ఉండవచ్చు, ఆయా ప్రాంతాలు పర్యాటకంగా కానీ, పారిశ్రామికంగా కానీ ప్రముఖమైన ప్రాంతాలై
ఉండటంవల్ల అంతర్జాతీయ విమానాశ్రయాలు వచ్చి ఉండవచ్చు. కానీ వాటికి ఏమాత్రం తీసిపోని నగరం వరంగల్.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఉద్యమం జరుగుతున్న కాలంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని, లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి దీన్ని దేశ రెండవ రాజధానిని చేయాలని వాదనలు లేపినవాళ్లంతా తెలంగాణకు వరంగల్‌ను రాజధాని చేయవచ్చుకదా అని దీర్ఘాలు తీసిన విషయం కూడా తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ తర్వాత అంత ముఖ్యమైన నగరం వరంగల్.
రాష్ట్రసాధన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని మాటలు చెప్పిందితప్ప ఎటువంటి పురోగతి సాధించలేకపోయింది. కారణాలేవైనా కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టినందుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు వరంగల్ మీద శ్రద్ధ చూపిస్తున్నందుకు తప్పనిసరిగా అభినందించవలసిందే. ఎనిమిది వందల కోట్ల ఖర్చుతో రాబోతున్న వరంగల్ విమానాశ్రయం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 205 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ సంవత్సరాంతానికి అక్కడినుంచి దేశీయ విమానయానం మొదలవుతుందని కూడా చెప్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఒక తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకటికి మించిన విమానాశ్రయాలు ఉండడం, అందులో కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా కావడం గమనార్హం. కర్ణాటకలో ఆరు విమానాశ్రయాలు ఉంటే అందులో రెండు అంతర్జాతీయస్థాయి పొందినవి. తమిళనాడును తీసుకున్నట్టయితే ఆరు విమానాశ్రయాలు ఉంటే అందులో మూడు అంతర్జాతీయస్థాయికి చెందిన విమానాశ్రయాలు. అతి చిన్న ప్రాంతమైన గోవాలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. అది పర్యాటకంగా అత్యంత ప్రముఖమైన ప్రాంతంగాబట్టి, విదేశీ టూరిస్టుల రాకపోకలు ఎక్కువ కాబట్టి అనుకోవచ్చు. ఈ దేశంలో అత్యధికంగా 21 విమానాశ్రయాలున్నది అతిపెద్ద రాష్ట్రమయిన ఉత్తరప్రదేశ్‌లో.
తెలంగాణ విషయానికొస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి ప్రయోగాత్మకంగా వరంగల్ నుంచి దేశీయ విమానాలను ప్రయాణికుల కోసం నడిపేందుకు ప్రయత్నాలు జరిగాయి కానీ అది ఫలించలేదు. ఇప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలను ముఖ్యంగా ఐటి పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు విస్తరించాలి. హైదరాబాద్ రద్దీగా తయారవుతుందనుకుంటున్న తరుణంలో వరంగల్‌లో విమానాశ్రయం రావడం అనేది చాలా అవసరం. దీన్ని కేంద్రం గుర్తించడం, అలాగే 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని శంషాబాద్ విమానాశ్రయం నిర్మించిన జిఎంఆర్ సంస్థ పెట్టిన షరతును సడలించేందుకు అంగీకరించడం కూడా ఒక మంచి పరిణామం.
ప్రస్తుతం వరంగల్ నగరంలో కలిసిపోయిన మామునూరు విమానాశ్రయం ప్రాముఖ్యతకు సంబంధించి కొంచెం చెప్పుకోవాలి. ఇది చివరి నిజాం రాజు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ 1930వ సంవత్సరంలో నిర్మించిన విమానాశ్రయం. అప్పట్లో ఆయన తన వ్యాపార అవసరాలకోసం హైదరాబాద్, ఆదిలాబాద్ తోపాటు మహారాష్ట్రలోని ఔరంగాబాద్, కర్ణాటకలోని బీదర్ ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాలు నిర్మించుకున్నారు. ఉత్తర తెలంగాణలో నిజాంకు సంబంధించిన పేపర్ మిల్లుల వ్యాపార సంబంధమయిన రవాణాకోసం మామునూరు విమానాశ్రయం నిర్మించడం జరిగింది. ఈ విమానాశ్రయానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. మామునూరు పక్కనే ఉన్న బొల్లికుంట గ్రామానికి దాదాపు 25 సంవత్సరాలు సర్పంచ్‌గా వ్యవహరించిన దొంతి రామిరెడ్డి మాటల్లో చెప్పాలంటే ఆయన చిన్న పిల్లవాడిగా ఉన్న సమయంలో ఆపరేషన్ పోలో జరిగింది. ఇది 1948లో హైదరాబాద్ రాష్ట్రాన్ని పోలీస్ యాక్షన్ ద్వారా భారతదేశంలో
విలీనం చేసేందుకు జరిగిన సైనిక చర్య. అప్పుడు మామునూరు విమానాశ్రయం మీద బాంబులు పడటం తాను పసిపిల్లవాడిగా చూసానని చెప్పారు రామిరెడ్డి. ఆపరేషన్ పోలో జరుగుతున్న సమయంలో రెండు చిన్న విమానాలు మామునూరు విమానాశ్రయం మీదుగా వచ్చి బాంబులు కురిపించి ఆ విమానాశ్రయాన్ని వాడటానికి వీలులేకుండా చేసి పోయిన సంఘటనకు ఆయన ప్రత్యక్షసాక్షి. అంతకుముందు దాదాపు 200 మందిని తీసుకొని ఒక పెద్ద విమానం అక్కడనుంచి వెళ్ళిందని కూడా ఆయన చెప్పారు. రామిరెడ్డి మాటలకు ఆధారాలు కేంద్ర రక్షణ శాఖ ప్రచురించిన ఆనాటి పోలీస్ యాక్షన్ సంబంధించిన ఒక పుస్తకంలో మనకు లభిస్తాయి. అప్పట్లో ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ కాటన్ అనే పైలెట్ పాకిస్తాన్ నుంచి నిజాంకు చేరవేయడానికి ఆయుధాలు తీసుకొస్తున్నాడని, వాటిని మామునూరు విమానాశ్రయం దగ్గర దింపుతున్నాడని సమాచారం తెలియడంతో బాంబులు వేసి విమానాశ్రయాన్ని పని చెయ్యకుండా చేశారు. భారత సైన్యం తో పోరాడేందుకు నిజాం నవాబు ఆయుధాలు సమీకరించుకునే ప్రయత్నం చేసినట్టుగా కూడా ఆ పుస్తకం ద్వారా మనకు తెలుస్తుంది.
మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిజాం స్నేహపూర్వకంగా మామునూరు విమానాశ్రయాన్ని రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ సైన్యాలకు అప్పగించడంతో, వాళ్లు తమ సైనిక అవసరాలకోసం ఆ విమానాశ్రయాన్ని వాడుకునేవారని గ్రామస్థులు చెబుతూంటారు. తరచూ కొంతమంది తెల్లవాళ్ళు ఆ చుట్టుపక్కల గ్రామాలకు వచ్చి చెరువుల్లో స్నానం చేసి వెళ్ళేవారట. భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1959లో వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీకి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన సమయంలో ఆయన మామునూరు విమానాశ్రయంలోనే ప్రత్యేక విమానంలో దిగారు. అంతేకాదు, 1962లో చైనా యుద్ధ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌వారు తమ విమానాలను సురక్షితంగా ఉంచేందుకు ఢిల్లీ, తదితర ప్రాంతాలనుంచి మామునూరు విమానాశ్రయానికి తీసుకొచ్చి పార్క్ చేసేవారని కూడా చరిత్ర చెబుతోంది. ఇంత చరిత్రాత్మకమైన మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు నోచుకోవడం తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా వరంగల్ ప్రాంతాభివృద్ధికి అత్యంత దోహదకారి అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసిన విషయం లో కొన్ని ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఆయన పర్యటనను ఎద్దేవా చేస్తూ వెకిలి వ్యాఖ్యానాలు చేయడం కూడా విన్నాం, చూసాం. రాష్ట్రానికి కావలసిన విషయాలను అడగడానికి రేవంత్ రెడ్డి వెళ్తే రాష్ట్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉల్టా ఒక నోట్ ముఖ్యమంత్రికి ఇస్తే ఆయన చిన్నబోయి తిరిగి వచ్చారని కూడా ప్రచారం జరిగింది.
ఇవన్నీ 2017 నుంచి 2022 వరకు పెండింగ్‌లో ఉన్న అంశాలు. అప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నది ఎవరు? ముఖ్యమంత్రికి ప్రధాని ఝలక్ ఇచ్చారని రాసిన పత్రిక యజమాని అయిన భారత రాష్ట్ర సమితి కాదా అప్పుడు అధికారంలో ఉన్నది? ప్రభుత్వం అనేది కొనసాగింపు కాబట్టి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ నోట్ ఇవ్వడంలో తప్పులేదు. దాన్ని అమలు చేస్తానని ముఖ్యమంత్రి చెప్పడంలో కూడా తప్పులేదు. కానీ ఇదంతా ఏదో రేవంత్ రెడ్డిని అవమా నించడానికి ప్రధానమంత్రి చేసిన వ్యవహారం అన్న విధంగా చూపబోయి ప్రతిపక్షం బొక్కబోర్లా పడింది.
రాజకీయాల సంగతి అలా ఉంచితే తెలంగాణలో ఇంకొక విమానాశ్రయం.. అది కూడా వరంగల్లో అంతర్జాతీయస్థాయిలో రావడాన్ని అందరూ ఆహ్వా నించాల్సిందే. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఇప్పటివరకు ఒకటే ఒక విమానాశ్రయం ఉండటం గమనార్హం. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లో, తెలంగాణకంటే చాలా చిన్నవైన రాష్ట్రాల్లో కూడా ఒకటికి మించి విమానాశ్రయాలు ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి. అందులో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు.
అప్పట్లో ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ కాటన్ అనే పైలెట్ పాకిస్తాన్ నుంచి నిజాంకు చేరవేయడానికి ఆయుధాలు తీసుకొస్తున్నాడని, వాటిని మామునూరు విమానాశ్రయం దగ్గర దింపుతున్నాడని సమాచారం తెలియడంతో బాంబులు వేసి విమానాశ్రయాన్ని పని చెయ్యకుండా చేశారు.