Monday, March 3, 2025

12నుంచి బడ్జెట్ సమావేశాలు?

- Advertisement -
- Advertisement -

తొలిరోజు గవర్నర్ ప్రసంగం
15న అసెంబ్లీలో వార్షిక
బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న
డిప్యూటీ సిఎం భట్టి 7,8
తేదీల్లో ప్రత్యేక సమావేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 12వ తేదీ నుంచినిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి నట్లు అధికారవర్గాల సమాచారం. తొలిరోజు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఉభయసభలనుద్ధేశించి ప్రసంగించనున్నారు. ఆ మరుసటి రోజు గవర్నర్ ప్ర సంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండనున్నది. 14వ తేదీ హోలి పండుగ సెలవుదినం కావడంతో సమావేశం 15వ తేదీన ప్రారంభం కానున్నాయి. అదే రోజున ప్రభుత్వం ఉభయ సభల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఈవర్గాల సమాచారం. ఈ నెల 15న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ సమావేశాలు నెలాఖరు వరకు కొనసాగిన అనంతరం సభ బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నది. ఈ సమావేశాల్లో మున్సిపల్,

వ్యవసాయ శాఖకు సంబందించి తెలంగాణ సీడ్ బిల్‌తో పాటు మరికొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈనెల 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. రెండో దఫా కులగణన నిర్వహించిన నేపథ్యంలో వాటికి సంబంధించిన గణాంకాలపై కేబినెట్ చర్చించడంతో పాటు బిసిలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణలో ఉప కులాలకు రిజర్వేషన్లు అంశాలపై శాసనసభలో తీర్మానం చేయనున్నది. ఇందుకు గానూ ఈ నెల 7, 8తేదీల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నది. సభ ఆమోదించిన తీర్మాణాలను కేంద్రం ప్రభుత్వ ఆమోదానికి పంపించనున్నారు. 10వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఉభయసభల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసేందుకు ప్రధాని వద్దకు అఖిలపక్ష నేతలను తీసుకువెళ్ళనుట్టు సీఎం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. తదనంతరం ఈనెల 12న తిరిగి వార్షిక బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News