- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్‌లో జరిగిన ఆలిండియా అస్మిత మహిళల రోయింగ్ పోటీలు శనివారం ముగిసాయి. మహిళల అండర్19, అండర్ 23 విభాగంలో పోటీలను నిర్వహించారు. రెండు విభాగాల్లో కలిపి కొచ్చిన్ క్వీన్స్ ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది.
ఈ ఛాంపియన్‌షిప్‌లో దేశంలోని వివిధ రోయింగ్ క్లబ్‌లకు చెందిన క్రీడాకారిణిలు అసాధారణ ఆటతో అలరించారు. కాగా, హైదరాబాద్ క్వీన్స్ రెండో స్థానంలో నిలిచింది. విజేతలకు శాట్స్ విసిఎండి సోనీ బాలాదేవి ట్రోఫీలను బహూకరించారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇస్మాయిల్ బేగ్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు.
- Advertisement -