- Advertisement -
అమరావతి: విఆర్ వొలు ఇంటింటికీ వెళ్లి శాశ్వత కులధ్రువ పత్రాలు అందించారని ఎపి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో 28.62 లక్షల కుటుంబాలకు శాశ్వత కులధ్రువ పత్రాలు అందజేశామని అన్నారు. క్షేత్రస్థాయిలో 34.37లక్ష కుటుంబాల డేటా పరిశీలించామని, ఇక నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగనక్కరలేదని చెప్పారు. వివిధ కారణాలతో 5 లక్షల కుటుంబాలకు కులధ్రువ పత్రాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అర్హులుంటే సచివాలయాలు, ఎపి సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయవచ్చునని తెలియజేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే కులధ్రువ పత్రాలు అందిస్తారని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
- Advertisement -