- Advertisement -
దుబాయ్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా లీగ్ దశలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో టీం ఇండియా తడబడుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మాట్ హెర్నీ బౌలింగ్‌లో శుభ్‌మాన్ గిల్(2) ఎల్‌బిడబ్ల్యూగా పెవిలియన్ చేరగా.. జెమిసన్ బౌలింగ్‌లో విల్ యంగ్‌కి క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ(15) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ మ్యాట్ హెర్నీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. క్రీజ్‌లో శ్రేయస్ అయ్యర్(3), అక్సర్ పటేల్(1) ఉన్నారు.
- Advertisement -