Monday, March 3, 2025

రెండు రాష్ట్రాల్లో ఒకే ఓటర్ ఐడి నంబర్?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎపిక్ సంఖ్యలలో నకిలీని ఉదాహరించారు, రాష్ట్ర ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్లను జోడించడానికి బిజె, ఎన్నికల సంఘంతో కుమ్మక్కయిందని ఆరోపించారు. కాగా ఓటరు ఐడి కార్డులలో ఎపిక్ నంబర్లలో నకిలీలు ఉండటం వల్ల నకిలీ ఓటర్లు వచ్చారని ఎన్నికల సంఘం ఆదివారం స్పష్టం చేసింది. ఓటర్ల డేటాబేస్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు మార్చడానికి ముందు అనుసరించిన వికేంద్రీకృత, మాన్యువల్ యంత్రాంగం కారణంగా ఈ నకిలీలు జరిగాయని ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఓటర్లందరికీ ప్రత్యేకమైన ఎపిక్ నంబర్‌లను అనుమతించడం ద్వారా ఈ నకిలీ సరిదిద్దబడుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది.

పశ్చిమ బెంగాల్‌లో నకిలీ ఓటర్లను చేర్చడానికి బిజెపి, ఎన్నికల సంఘం కుమ్మకయ్యాయని మమతా బెనర్జీ గట్టిగా వాదిస్తున్నారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ నకిలీ ఓటర్లను చేరుస్తున్నారని ఆమె నిందించారు. ‘అన్ని జిల్లాల రుజువులు నా వద్ద ఉన్నాయి. అవి ఇవిగో. హర్యానా, గుజరాత్ ప్రజల పేర్లు పశ్చిమ బెంగాల్ వాసులతో, అదే ఎపిక్ నంబర్లు కలిగి ఉన్నాయి. ఎపిక్ అంటే ఎలెక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు. నకిలీ ఓటర్లను పశ్చిమ బెంగాల్ జాబితాలో చేర్చారు’ అని మమతా బెనర్జీ ఆరోపించారు. మహారాష్ట్ర, ఢిల్లీలోని ప్రతిపక్ష పార్టీలు ఈ టాక్టిక్‌ను గుర్తించడంలో విఫలమయ్యాయి. ‘కానీ మేము గుర్తించాము.

బిజెపి ఇలా చేసే మహారాష్ట్ర, ఢిల్లీలో గెలుపొందింది. వారిప్పుడు పశ్చిమ బెంగాల్‌ను లక్షం చేసుకున్నారు. మేము తీవ్రంగానే ప్రతిస్పందిస్తాం’ అన్నారు. ‘ఎన్నికల సంఘం అండదండలతోనే బిజెపి ఓటర్ల జాబితాను తారుమారు చేస్తోంది’ అని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల సంఘం మమతా బెనర్జీ పేరెత్తకుండానే వివరణ ఇచ్చింది. వివిధ రాష్ట్రాలలో ఒకే ఎపిక్ నంబర్‌తో ఉన్న కార్డుల గురించి సామాజిక మాధ్యమంలో, మీడియాలో వస్తున్న వార్తలను గమనించామంటూ వేర్వేరు రాష్ట్రాలలో కొందరి ఓటర్ల ఎపిక్ నంబర్ అదే మాదిరి ఉండిఉండొచ్చని, కానీ అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ వంటివి ఒకటై ఉండవనిపేర్కొంది.

ఎపిక్ నంబర్‌తో సంబంధం లేకుండానే ఓటరు తన నియోజకర్గంలో ఓటేయొచ్చు అని తెలిపింది. అంతేకాక ఎరోనెట్ 2.0 ప్లాట్‌ఫామ్‌ను అప్డేట్ చేస్తామని, ప్రత్యేకమైన ఎపిక్ నంబర్‌తో ఎపిక్ నంబర్‌ను సరిదిద్దుతామని తెలిపింది.ఇదిలావుండగా సీనియర్ బిజెపి నాయకుడు, పశ్చిమ బెంగాల్ కోఇన్‌ఛార్జీ అమిత్ మాలవీయ స్పష్టీకరణ ఇస్తూ ‘మమతా బెనర్జీ మరో అబద్దం చెబుతోంది. 2026లో ఓడిపోతానన్న భయంతో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తోంది. ఎన్నికల విధానంలో ఓటర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది’ అంటూ ‘ఎక్స్’ పోస్ట్ పెట్టారు. అంతేకా ఆయన ఓటర్ల జాబితా నుంచి బంగ్లాదేశీలు, రొహింగ్యాల పేర్లను తొలగించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News