Monday, March 3, 2025

కనిపించిన నెలవంక….. నేటి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ముస్లింలు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగల్లో అత్యంత ముఖ్యమైనది రంజాన్. శనివారం హైదరాబాద్‌లోనూ, దేశంలోని పలు ప్రాంతాల్లో నెలవంక దర్శనం ఇచ్చింది. నెలవంక దర్శనంతో ముస్లింలు బంధుమిత్రులకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందోత్సవాలు పంచుకున్నారు. ఆదివారం నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం అవుతున్నాయి. రంజాన్ నెలలో ప్రత్యేక ప్రార్థనలు తరావీ నమాజ్ శనివారం నుండి ప్రారంభమయ్యింది. నెల రోజుల పాటు ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు రంజాన్ మాసం దృష్టా పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. నెల రోజుల పాటు ఉపవాస దక్షలు, ప్రత్యేక ప్రార్థనలు, పవిత్ర గ్రంథం ఖురాన్ పఠనంతో ముస్లింలు భగవత్ ధ్యానంలో గడుపుతారు. రంజాన్ సందర్భంగా మసీదులను విద్యుద్దీపాలతో అలంకరించారు.

సిఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని సిఎం తన సందేశంలో పేర్కొన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్మాత్మికతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిస్తోందన్నారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముస్లింల అభ్యున్నతికి తోడ్పడే కార్యక్రమాలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, అల్లా దీవెనలు పొందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కెసిఆర్ శుభాకాంక్షలు

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు మాజీ ముఖ్యమంత్రి , బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు, ఆధ్మాత్మికతను, జీవిత పరమార్థాన్ని ఎరుకపరిచి, క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. గంగా జమున తెహజీబ్ కు తెలంగాణ జనజీవనం దర్పణంగా నిలుస్తుందని అన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణకు మనం దేశానికే ఆదర్శంగా నిలిచామని, అదే వారసత్వాన్ని కొన్సాగించాలని తెలిపారు. నెల రోజుల పాటు సాగే పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల ఆకాంక్షలు దేవుని దీవెనలతో సాకారం కావాలని కెసిఆర్ ప్రార్థించారు.

నేటి నుండి ఒంటిపూట ఉర్దూమీడియం బడులు

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ సందర్భంగా నెల రోజుల పాటు ఉప్వాస దీక్ష్ల పాటిస్తున్నందున మార్చి 2 నుంది ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉర్దూ మీడియం పాఠశాలలకు, ఉర్దూ మీడియం సెక్షన్స్‌కు, డైట్‌లోని ఉర్దూ మీడియం విభాగాలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉర్దూ మీడియం విద్యార్థులు ఉద్యం 8 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. మైనారిటీ గురుకుల విద్యాలయాల్లోనూ రంజాన్ సందర్భంగా ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు టెమ్రీస్ అధ్యక్షుడు మొహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీ ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News