1993 సంవత్సరంలో బుకర్ ఆఫ్ బుకర్ బహుమతి సల్మాన్ రష్దీ రాసిన మిడ్నై్స చిల్డ్రన్‌కి, 2008 సంవత్సరానికి గాను భారతీయ రచయిత అరవింద్ అడిగా మొట్టమొదటి రచన ది వైట్ టైగర్ కి ఇచ్చారు. టాంబ్ ఆఫ్ శాండ్’ పేరుతోహిందీ నవలా రచయిత గీతాంజలీ శ్రీ రచించిన నవలకు 2022 ఏడాదికి గాను బుకర్ ప్రైజ్ వచ్చింది. భారతీయ భాషల నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి పుస్తకంగా ఇది.
కన్నడ భాషలో భాను ముస్తాక్ రచించిన హార్ట్ ల్యాంప్ నవల కూడా ఈ సారి బుకర్ ప్రైజ్‌కు నామినేట్ అయింది. బుకర్ ప్రైజ్ ఆంగ్ల సాహిత్యం లో ఉత్తమ నవలకు ప్రతి సంవత్సరం కామన్వెల్త్ దేశాలు ఐర్లాండ్, జింబాబ్వే దేశాలకు చెందిన రచయితలకు ఇచ్చే పురస్కారం. 1993 సంవత్సరం లో బుకర్ ఆఫ్ బుకర్ బహుమతి సల్మాన్ రష్దీ రాసిన మిడ్‌నైట్ చిల్డ్రన్‌కి, 2008 సంవత్సరానికి గానూ భారతీయ రచయిత అరవింద్ అడిగా మొట్టమొదటి రచన “ది వైట్ టైగర్”కి ఇచ్చారు. ‘టాంబ్ ఆఫ్ శాండ్’ పేరుతో హిందీ నవలా రచయి త గీతాంజలీ శ్రీ రచించిన నవలకు 2022 ఏడాది కి గానూ బుకర్ ప్రైజ్ వచ్చింది. భారతీయ భాషల నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి పుస్తకం ఇది. సాహితీ ప్రపంచం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిం చే బుకర్ ప్రైజ్‌కు గానూ ఈసారి ప్రచురణకర్తలు సమర్పించిన 154 పుస్తకాల నుండి లాంగ్ లిస్ట్ అయ్యే పుస్తకాల ఎంపిక మొదట జరుగుతుంది.
1 మే 2024, 30 ఏప్రిల్ 2025 మధ్య ఆంగ్లంలో కి అనువదించబడిన రచనలకు గానూ బుకర్ ప్రైజ్ 2025 బహుమతి అందించబడుతుంది.
అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌కి లాంగ్ లిస్ట్ అయిన మొత్తం 13మంది రచయితలు ఈ సంవత్సరం మొట్ట మొదటిసారి నామినేట్ చేయబడ్డారు. సాంప్రదాయేతర విభాగంలో తమ పుస్తకాలు తామే స్వతంత్రంగా ప్రచురణ చేసుకున్న వాళ్ల సంఖ్య కూడా ఈసారి ఎక్కువగానే ఉంది. వీరిలో మెర్సియ కర్రె స్కూ, హిరోమీ కవకామి, క్రిస్టియన్ క్రాత్ వంటివారు లాంగ్ లిస్ట్ చేయబడిన రచయితల్లో ఉన్నా రు. సోఫీ హ్యూస్ అనే అనువాదకురాలు కూడా ఐదోసారి ఈ లిస్టులో ఉన్నారు. ఆంగ్లంలోకి అనువాదం అయిన బహుమతి గెలుచుకున్న పుస్తకానికి లభించే 50,000 పౌండ్ల బహుమానాన్ని రచయి త, అనువాదకులు ఇద్దరికీ సమానంగా పంచుతా రు. 2025 జాబితాలోని 13 శీర్షికలతో ఉన్న పుస్తకాల్లో 12 స్వతంత్ర ప్రచురణలుగా వచ్చాయి. బుకర్ ప్రైజ్ కోసం లాంగ్ లిస్ట్ చేయబడిన మొట్టమొదటి రొమేనియన్ రచయిత కాట్రరస్కు. అతని నవల ‘సో లనోయిడ్’ను సీన్ కాటర్ అనువాదం చేశాడు.
1970, 1980లలో కమ్యూనిస్టు బుఖారెస్ట్ ప్రాంత నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అస్తిత్వ, వాస్తవిక శైలిలో కథను నడిపిస్తాడు రచయిత కాట్రరస్కు. గత ఏడాది మే నెలలో ఈ నవల డబ్లిన్ సాహిత్య పురస్కారాన్ని కూడా గెలుచుకుం ది. రొమేనియన్ నవలతో పాటు, మన దేశానికి చెందిన దక్షిణ భారతీయ భాష అయిన కన్నడ భాషలో భాను ముస్తాక్ రచించిన ‘హార్ట్ ల్యాంప్’ నవలను దీపా బస్తీ అనువాదం చేశారు. “స్ట్రేంజ్ వెదర్ ఇన్ టోక్యో” అనే ప్రసిద్ధ నవల రాసిన రచయిత్రి కవాకామి. ఆమె రాసిన “అండర్ ద ఐ ఆఫ్ బిగ్ బర్డ్” పుస్తకం కూడా ఈ మారు ఎంపిక చేయబడిన పుస్తకాల్లో ఒకటి. అలాగే జర్మన్ రచయిత క్రాచ్ట్ రాసిన “యూరోటేష్”ను జర్మనీ భాష నుండి డానియల్ బౌల్స్ అనువదించాడు.
ఒక మధ్య వయసులో ఉన్న రచయిత, తీవ్రంగా జబ్బు పడ్డ తన తల్లితో కలిసి స్విట్జర్లాండ్‌కు రోడ్డు మార్గం గుండా ప్రయాణించటం ఈ కథాంశం. పాలస్తీనా రచయిత దిశ ఇబ్దిసామ్ అజ్రీమ్ రాసిన “ది బుక్ ఆఫ్ డిసిపియరెన్స్” మొదటిసారి బుకర్ ప్రైజ్‌కు నామినేట్ చేయబడింది. 43 సంవత్సరాల క్రితం డచ్‌లో ఆస్ట్రిడ్ రోమర్ రాసిన “ఆన్ ఎ ఉమెన్స్ మ్యా డ్నెస్” నవల ప్రచురించబడింది. ఆ నవలను లూసీ స్కాట్ ఇంగ్లీషులోకి అనువాదం చేయగా ఇప్పుడు అది బుకర్ ప్రైజ్ లాంగ్ లిస్టులోకి చేరింది. సోల్వేజ్ బల్లే “ఆన్ ద కాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూమ్”, గెల్లే బెలెం “దేర్ ఈజ్ ఎ మాన్‌స్టర్ బిహైండ్ ది డోర్” డహ్లియాడిలా సెర్డా “రిజర్వాయర్ బీచెస్” విన్సెంట్ డోలెక్రోయిక్స్ ‘స్మాల్ బోట్’ అన్నే సెర్రే “ఎ లెపర్డ్ స్కిన్ హ్యాట్” పుస్తకాలూ లాంగ్ లిస్టులో చోటు సంపాదించుకున్నా యి. రచయిత, న్యాయనిర్ణేత కూడా అయిన చైర్మాక్స్ పోర్టర్ బుక్కర్ ప్రైజ్ కోసం లాంగ్ లిస్టు అయిన పుస్తకాలు కుటుంబం, ఆధ్యాత్మికత, మానవ సంబంధాలలోని వేదనలు, సంక్లిష్టతలు, ప్రేమ, సమాజంలో నెలకొని ఉన్న సంఘర్షణలు, రాజకీయాలు ఇలా అనేక అంశాలను సృశించా యి. అవి పాఠకులను అవి తమతో పాటు తీసుకుపోతాయంటాడు. తిరిగి ఈ అన్ని పుస్తకాల నుండి మళ్ళీ షార్ట్ లిస్టు చేసే ఆరు పుస్తకాలను ఏప్రిల్ 8న ప్రకటిస్తారు. అంతిమంగా మే 20న లండన్‌లో జరిగే వేడుకలో చివరకు నెగ్గిన బుకర్ ప్రైజ్ విజేతను ప్రకటిస్తారు.
అనంత చంద్ర