Tuesday, March 4, 2025

ఘోర

- Advertisement -
- Advertisement -

చిన్నప్పుడు వచ్చే పీడకల
ఇప్పుడు నిజమై
ఎదురుగా వచ్చి కూర్చుంది
బూచోడు రానే వచ్చాడు
పచ్చి కలికాలాన్ని వెంట తెచ్చాడు
వాడు తన మొండిమొల
నిస్సిగ్గుగా చూపించింది చాలక
చెమటోడ్చి నిర్మించుకున్న
నాగరికతని గేలిచేసి
దేశం నలుచెరుగులా
విద్వేష బూడిద చల్లుకుంటూ పోతున్నాడు
వాడు పారుకుంటూ పోయేది మతం కాదు
అవధుల్లేని అరాచకం
కపాల కంచంలో మనిషితనాన్ని
నమిలి మింగి
దేశం మీద వాంతి చేసుకునే మృగం
అయ్యో! ఎవరన్నా దాని కోరలు పీకండి!
ఈ భూమిని పీనుగుల పెంట చేసేదాకా
నిద్రపోయేట్టు లేడు
వాడి విశృంఖల నర్తనతో
ఇది మరుభూమి కాకముందే
బూచోడిని బంధించి
భూమికి అవతల విసిరేయండి!

చల్లపల్లి స్వరూపరాణి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News