Tuesday, March 4, 2025

ఢిల్లీలో తదుపరి షెడ్యూల్

- Advertisement -
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న ‘ఆర్ సి 16’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా రెండో షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో పూర్తయింది. అయితే, తాజా అప్‌డేట్ ఏమిటంటే, మేకర్స్ తదుపరి షెడ్యూల్ కోసం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇది చాలా కీలకమైన షెడ్యూల్ అని చెబుతున్నారు. రాజధాని నగరంలో షూటింగ్ లోకేషన్‌లను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

అన్నట్టు ఢిల్లీ షెడ్యూల్ తర్వాత, ఉప్పాడ బీచ్, వాకలపూడి బీచ్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు అని టాక్ నడుస్తోంది. కథ రీత్యా ఈ సినిమాలో క్రికెట్, కుస్తీతో పాటు మరికొన్ని ఆటలకు ప్రాధాన్యముంది. చరణ్ దీం ట్లో అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఓ కొత్త క్యారెక్టరైజేషన్‌లో కనిపించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటిం గ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి ‘పెద్ది’ అనే పేరుతో పాటు మరో రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మార్చి 27న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ టీజర్ రిలీజ్ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News