Tuesday, March 4, 2025

మామునూర్ కు మాస్టర్ ప్లాన్ రెడీ

- Advertisement -
- Advertisement -

భూసేకరణ పూర్తయిన రెండున్నర ఏళలోగా విమానాశ్రయంలో సేవలు
ప్రారంభం హైదరాబాద్‌ను ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి చేయడమే ప్రధాని
మోడీ లక్షం రెండు తెలుగు రాష్ట్రాల ప్రగతికి పాటుపడాలని మా
నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశించారు విలేకరుల సమావేశంలో
పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మామునూరు
ఎయిర్‌పోర్టుతో మరింత అభివృద్ధి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: వరంగల్ జిల్లా లోని మామునూర్ ఎయిర్‌పోర్టు పనులు చేప ట్టేందుకు అవసరమైన మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన 280 ఎకరాల భూమి ని అప్పగించిన రెండున్నరేళ్ల లోగా మామునూ రు ఎయిర్‌పోర్టులో సేవలు ప్రారంభిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఓరుగల్లు విమానాశ్ర యాన్ని రూ.500 కోట్ల వ్యయంతో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మాణం చేపడుతుంద ని వెల్లడించారు.

ఎంతో పురాతనమైన మాము నూరు ఎయిర్‌పోర్టు కోసం ఎంతో కాలంగా ఎం దరో పోరాడారని ఇప్పటికి విముక్తి లభించిందని అన్నారు. ఓరుగల్లు నగరానికి విమానాశ్రయం మంజూరై రాష్ట్రంలో రెండో విమానాశ్రయం ఏ ర్పాటు తన హయాంలో జరగడం తనకెంతో సం తోషంగా ఉందని అన్నారు. ఎయిర్‌పోర్టుకు క్లి యరెన్స్ రావాలన్నది ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ అని, అది తన హయాంలో జరగడం ఆ నందంగా ఉందని తెలిపారు. హైదరా బాద్‌లోని కవాడిగూడలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాల యాల సముదాయం (సిజిఓ టర్స్)లోని పిఐబి కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేక రుల సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డితో కలిసి రామ్మోహన్‌నాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ సాధారణంగా ఎయిర్‌పోర్టు నిర్మాణం జరగాలంటే దాని విస్తీర్ణం బట్టి కనీసం మూడేళ్ళు పడుతుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని వెంటనే సేకరించి ఇస్తే రెండున్నర సంవత్సరాల్లోనే మామునూరు విమానాశ్రయం పూర్తి చేస్తామని వివరించారు.

చారిత్రక నగరం ఓరుగల్లుకు విమానాశ్రయ సేవలు పునరుద్దరణ జరగాలని తనతో పాటు ఎంతో మంది ఆశించారని, అయితే గత పాలకుల భూ కేటాయింపులో నిర్లక్షం చేయడం వల్ల ఆలస్యం అయ్యిందని అన్నారు. గత ఏడాది నవంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం భూ సేకరణ ద్వారా 280 ఎకరాల భూమిని ఇస్తామని జివో జారీ చేయడం ద్వారా ఈ ప్రక్రియ ముందుకెళ్లిందని తెలిపారు. మామునూరు విమానాశ్రయంలో ఇప్పుడు ఉన్న రన్‌వే విమానాలు నడిపేందుకు పనికి రాదని, డొమెస్టిక్ విమానాల రాకపోకలకు కూడా సరిపోదని అన్నారు. ఇందుకు అనుగుణంగా 2,800 మీటర్ల రన్‌వే అవసరమని, ఇప్పుడు ఉన్న భూమికి అదనంగా 280 ఎకరాలు భూసేకరణ అవసరమని కేంద్రం నుంచి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేస్తే విమానాశ్రయం పనులు వేగవంతమవుతాయని వివరించారు.

హైదరాబాద్ కేంద్రంగా ఎయిరో స్పేస్ హబ్

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ఎయిరో స్పేస్ హబ్ ఏర్పాటు చేయాలని భావిస్తోందని అన్నారు. హైదరాబాద్ వాతావరణపరంగా, రవాణా, పెట్టుబడులు, తదితర అన్ని కోణాల్లో అనువైనదిగా గుర్తించి ఎయిరో స్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ చేయాలన్నది తమ లక్షమని వివరించారు. ఇందుకు హైదరాబాద్‌ను ఎయిరో స్పేస్ హబ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం వద్ద విమానాశ్రయం ఏర్పాటు విషయంలో గతంలో ఒక స్థలాన్ని ప్రతిపాదించారని, దానికి ఫీజుబిలిటీ రిపోర్టు అనుకూలంగా రాకపోవడంతో ఆ ప్రతిపాదన తిరస్కరించబడిందని పేర్కొన్నారు. అక్కడ ఉన్న ఫీజిబులిటీని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి వద్ద కూడా ఎయిర్‌పోర్టు కావాలనే ప్రతిపాదన ఉందని, అక్కడ కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నందున ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News