విజయవంతంగా కాలుమోపిన రొబోటిక్ లూనార్ ల్యాండర్
న్యూయార్క్: మరో ముందడుగు ప డింది. రోబోటిక్ లూనార్ ల్యాండర్ చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయింది, ఇది ఆదివారం తెల్లవారు జామున సుమారు 2:35 గంటలకు చంద్రగ్రహంపై ల్యాండ్ అయింది. టెక్సాస్కు చెందిన కంపెనీ ఫైర్ఫ్లై ఈ రోబోటిక్ లూనార్ ల్యాండర్ ను నిర్మించిం ది. ఈ ల్యాడర్ కు బ్లూ గోస్ట్ గా నామకరణం చేశారు. బ్లూఘోస్ట్ ల్యాండర్,ను జనవరిలో స్పేస్‌ఎక్స్ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భూ కక్ష్యలో కొంత సమయం ప్రదక్షిణలు చేసిన తర్వాత చంద్రుని వైపు సాగింది. ప్రైవేటురంగంలో సాధ్యమైన రెండో విజ యం ఇది.
ఫైర్ఫ్లై సాఫ్ట్ లూనార్ ల్యాండింగ్ను సాధించిన రెండవ ప్రైవేట్ రంగ సంస్థగా అవతరించింది. గ తంలో పలు ప్రైవేటు సంస్థలు ఈ రంగంలో విఫలం అయ్యాయి. నాసా సహాయ సహకారాలతో ఇది సా ధ్యమైంది. ఫైర్ఫ్లై ఈ మిషన్ను నాసా, ఆర్టెమిస్ ప్రో గ్రామ్ల క్రింద కాంట్రాక్టర్గా నిర్వహిస్తోంది, ఈ దశా బ్దంలో మానవుడు తిరిగి చంద్రుడి పై అడుగు పెట్టే ప్రయోగానికి ముందు రోబోటిక్ ల్యాండర్లను ఉపయోగించడం దీని లక్ష్యం. బ్లూఘోస్ట్ మిషన్ ప్ర యోగం ఉత్కంఠ భరితంగా సాగి విజయవంతంగా ముగిసింది. లూనార్ ల్యాండర్ చంద్రగ్రహంపై అగ్నిపర్వతాలతో కూడిన ప్రదేశంలో తన ప్రయోగాలునిర్వహించే అవకాశం ఉంది.
బ్లూఘోస్ట్ దాని ఎక్స్ -బ్యాండ్ యాంటెన్నా విప్పుకున్న తర్వాత నిర్దేశించిన ప్రయోగాలకు సమాయత్తం అవుతుంది. ఇది చంద్రుని నుం డి డేటా, వీడియోలను ప్రసారం చేస్తుంది. నా సా, ఫైర్ ప్లే మొత్తం 10 సైన్స్. సాంకేతిక పరమైన ప్రయోగాలకు సమాయత్తం అవుతున్నాయి. మార్చ్ 14 లో గా, అంటే రెండు వారాల్లో, మిషన్ బృందాలు చం ద్రుని నేలలో వచ్చే మార్పులు, చంద్రుని నుం డి ఉష్ణ ప్రవాహాన్ని అధ్యయనం చేసి ఆ సమాచారాన్ని నా సాకు పంపుతుంది. బ్లూ ఘోస్ట్ కుమార్చి 14న గ్రహ ణం పడుతుంది. ఆనాడు చంద్రుడిపై లూ నార్ ల్యాం డర్ దిగిన ప్రదేశంలో చీకట్లు అలుముకుంటాయి. చంద్ర రాత్రి సమయంలో మైనస్ 130 డిగ్రీ ల సెల్సియస్ ఉష్ణోగ్రతలలో పని చేయడాన్ని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నందున ల్యాండర్ బ్యాటరీ శక్తి పై ఆధారపడవలసి ఉంటుంది.