Tuesday, March 4, 2025

రంగంలోకి రోబోలను దించుతాం

- Advertisement -
- Advertisement -

టన్నెల్లో చికుకున్నవారిని కాపాడేందుకు శాయశక్తులా కృషి, వారి పరిస్థితిపై ఇంకా స్పష్టత, ప్రపంచ చరిత్రలోనే ఇది
ఒక దుస్సంఘటన, మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎస్‌ఎల్‌బిసిని సందర్శించి, పరిస్థితిపై అధికారులతో సమీక్ష
సహాయక బృందాలకు నష్టం లేకుండా రెస్కూ ఆపరేషన్, సిఎం

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి : నాగర్ కర్నూల్ జిల్లా, దోమలపెంట వద్ద నిర్మాణం లో ఉన్న ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టు ఘటనలో టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని కాపాడడానికి అవసరమైతే రోబోలను రంగంలోకి దించుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగిన ఎస్‌ఎల్‌బిసి ట న్నెల్‌లో రెస్కూ టీం ప్రతినిధులు, అధికార యంత్రాంగం, మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి సొరంగం వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతర ం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక దు స్సంఘటనగా అభివర్ణించారు. ప్రపంచంలోనే 42 కిలోమీటర్ల సొరంగంతో నిర్మిస్తున్న అద్భుతమైన ప్రాజెక్టు ఎస్‌ఎల్‌బిసి అని అన్నారు.

ప్రాజె క్టు పనులు జరుగుతున్న క్రమంలో సొరంగం కూలిందని అన్నారు. ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల లో ఘటనలు జరుగుతుంటాయని.. కానీ ఎస్‌ఎల్‌బిసిలో జరిగిన ఈ ఘటన ప్రపంచ చరిత్రలోనే ఇబ్బందికరమైనదని వ్యాఖ్యానించారు. దేశ, వి దేశాలకు సంబంధించిన రెస్కూ టీంలను ర ప్పించామని, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, సిం గరేణి, మిలటరీ, నేవీ, హైడ్రాతో పాటు ర్యాట్ హోల్ మైనర్స్‌తో పాటు నేషనల్ జియోలాజికల్ సర్వే వంటి సంస్థలను ఇక్కడకు రప్పించి సహాయక చర్యలను ముమ్మరం చేశామని అన్నారు. ఎస్‌ఎల్‌బిసిలో ఇప్పటివరకు వచ్చింది ప్రాథమిక సమాచారమేనని.. పూర్తి స్థాయి అంచనాకు రా లేదని అన్నారు. 8 మంది ప్రాణాలతో ఉన్నదీ.. లేనిదీ సహాయక బృందాల నిపుణులకు ఇంకా స్పష్టత రాలేదన్నారు.

మనోధైర్యం కోల్పోలేదు

ఎస్‌ఎల్‌బిసి ఘటనతో మనోధైర్యాన్ని కోల్పోలేద ని, పట్టుదలతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2014 సంవత్సరం నాటికి 32 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయిందని అ న్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీరు ఇవ్వాలన్న సోయి లే కుండా గత ప్రభుత్వం వ్యవహరించిందని మం డిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి రెండు, మూడు కిలోమీటర్లు కూడా పనిచేయలేదన్నారు. ఎస్‌ఎల్‌బిసికి విద్యుత్ బిల్లులు కూడా చెల్లించకపోవడంతో కరెంట్‌ను కట్ చేశారని, ఇదంతా గ త ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వల్లే జరిగిందని మండిపడ్డారు.

పదేళ్లుగా ఎక్కడ ఆగిందో ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టు అక్కడే ఉందన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను ము ఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో పనులు ప్రారంభించానని అన్నా రు. అమెరికా నుంచి టిబిఎం మిషన్‌లు వంటి అ వసరమైన యంత్ర పరికరాలను రప్పించామని అన్నారు. 9 రోజులుగా పనిచేస్తున్న వివిధ రె స్కూ టీంలను ముఖ్యమంత్రి అభినందించారు. రెస్కూ టీంలతో నిర్విహించిన సమీక్షలో రెండు రోజులలో సమస్య కొలిక్కి వస్తుందని చెప్పారు. నీరు, బురద, మట్టిని తొలగించడానికి కన్వేయర్ బెల్ట్ మరమ్మతులు కీలకంగా మారాయని, సోమవారం సాయంత్రానికి బెల్ట్ అందుబాటులోకి వ స్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఒక ప్ర మాదమని, విపత్తు అని ప్రతిపక్షాలు గుర్తించాలన్నారు. తాము చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ప్రమా దం జరిగితే కొందరు రాజకీయ నేతలు రాజకీ యం చేస్తున్నారని దుయ్యబట్టారు. సమస్యను స మస్యగానే చూడాలే తప్ప రాజకీయం చేయవద్దని హితవు పలికారు. ఎస్‌ఎల్‌బిసి ఘటన కంటే ముందే శ్రీశైలం లెఫ్ట్ పవర్ బ్యాంక్ ఘటన సమయంలో ముఖ్యమంత్రిగాని, మంత్రులు గాని సంఘటన స్థలానికి రాలేదని గుర్తు చేశారు. ఘటన జరిగితే ముఖ్యమంత్రి రాలేదని విమర్శ లు చేసినవారు ప్రతిపక్ష నాయకులైన కెసిఆర్, ఎంపి కిషన్ రెడ్డి ఎక్కడ ఉన్నారని, తాను ఎ న్నికల ప్రచారంలో ఉన్నానని చెప్పినవారు ఏ ప్ర చారంలో ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. హరీశ్‌రావు దావతులు చేసుకుంటూ తమను విమర్శించడం తగదన్నారు.

మైండ్‌సెట్ కూడా పోయింది

బిఆర్‌ఎస్ నాయకులు అధికారం కోల్పోయిండ్ర ని. దాంతో ఆగక వారి మైండ్ సెట్ కూడా కోల్పోయారని ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకొని సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు. అంత కు ముందు రెస్కూ టీం ప్రతినిధులతో సమీక్ష స మావేశంలో సిఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ , జూపల్లి, ఎంపి మ ల్లు రవి, ఎంఎల్‌ఎలు వంశీకృష్ణ, బాలు నాయక్ తదితరులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News