మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవితగాధ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఛావా’. గత నెలలో హిందీలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని విడుదల చేశారు.
పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఉన్న తెలుగు టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ‘మరాఠా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎవ్వడు ఆలోచించినా చీల్చి ఛెండాడుతాను’ అంటూ సాగే డైలాగ్స్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఇక టీజర్‌లో చూపించిన యుద్ధ సన్నివేశాలు నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. ఇక ఈ సినిమా తెలుగులో మార్చి 7వ తేదీన విడుదల కానుంది.
విక్కీ కౌశల్, రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటించారు. లక్ష్మన్ ఉటెకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దినేష్ విజాన్ నిర్మించారు. ఎఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు తెలుగులో విడుదలై ఇంకా ఎంత సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే.