Tuesday, March 4, 2025

రష్మిక మందన్నకు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: పాన్ ఇండియా హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం చిక్కుల్లో పడింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆమె హాజరుకాకపోవడంపై మండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కెరీర్‌ను ఇచ్చిన ఇండస్ట్రీకి గౌరవం ఇవ్వాలని ఆయన మండిపడ్డారు.

ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రావాలని రష్మికను గత ఏడాది నుంచి ఆహ్వానిస్తున్నామని.. కానీ ఆమె రానని.. కర్ణాటకకు వచ్చేందుక సమయం తన వద్ద లేదని చెప్పారని అన్నారు. అంతేకాక తన ఇల్లు హైదరాబాద్‌లో ఉంది.. బెంగళూరు ఎక్కడ ఉందో తనకు తెలియదు అన్నట్లు మాట్లాడారు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలిసిన వాళ్లు కొంతమంది ఆమెను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఆమె సుముఖత తెలపలేదని అన్నారు. ఆమె కన్నడ భాష పట్ల, పరిశ్రమ పట్ల గౌరవం చూపించడం లేదని.. ఆమెకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన సమయం వచ్చిందని రవి గనిగ హెచ్చరించారు.

ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ప్రారంభ వేడుకల్లో ఈ విషయంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ‌కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నటీనటులు, దర్శక నిర్మాతలు ఒకే తాటి మీదకు రావాలని, కన్నడ భూమి, భాష గురించి నటీనటులు స్పందించకుంటే మీ నట్లు బోల్ట్‌లను టైట్‌ చేస్తామని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News