Tuesday, March 4, 2025

రామమందిరంపై ఉగ్రదాడి కుట్ర .. ఉగ్రవాది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఫరిదాబాద్: అయోధ్యలోని రామ మందిరంపై ఉగ్రదాడి చేసేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ చేసిన కుట్రను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఎటిఎస్) భగ్నం చేసింది. గుజరాత్ ఎటిఎస్, ఫరీదాబాద్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎస్) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాదిని హరియాణాలోని ఫరిదాబాద్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడు అబ్ధుల్ రహ్మన్‌గా గుర్తించారు. అతని నుంచి రెండు హ్యాండ్ గ్రెనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి గుజరాత్ ఎటిఎస్ అధికారులు ఫరిదాబాద్‌లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రహ్మన్‌ను గుజరాత్‌కు తరలించి విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News