Saturday, April 26, 2025

ఎసిబి వలలో జిహెచ్‌ఎంసి డిఈఈ

- Advertisement -
- Advertisement -

లంచం తీసుకుంటూ జిహెచ్‌ఎంసి డిప్యూటీ ఈఈ సోమవారం ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. జిహెచ్‌ఎంసిలో క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ ఈఈగా ఎ.దశరథ్ ముదిరాజ్ డిజివిజన్2లో పనిచేస్తున్నాడు. బాధితుడి ఫైల్ క్లియర్ చేసేందుకు రూ.20,000 డబ్బులు డిమాండ్ చేశాడు. ముందుగా రూ.10,000 ఇచ్చిన బాధితుడు మిగతా డబ్బులు పని అయిన తర్వాత ఇస్తానని చెప్పాడు. దీంతో డిఈఈ మిగతా డబ్బులు ఇవ్వాలని బాధితుడిపై ఒత్తిడి తేవడంతో ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు డిప్యూటీ ఈఈకి రూ. 20,000 కార్యాలయంలో ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత డిప్యూటీ ఈఈని నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చాగా, రిమాండ్ విధించారు. దీంతో డిఈఈని ఎసిబి అధికారులు జైలుకు పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News