నేటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి సమీక్ష
జిల్లాలు, నియోజకవర్గాలవారీగా నెలకొన్న పరిస్థితులపై ఆరా ఎన్నికల్లో గెలుపే లక్షంగా దిశానిర్దేశం
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందు కు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ తన కార్యాచరణ చే పట్టారు. అందులోభాగంగా పార్లమెంట రీ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలను ఆమె నిర్వహించనున్నారు. ఈ క్ర మంలోనే నేడు (మంగళవారం) ఆమె అ ధ్యక్షతన మధ్యాహ్నం 2.00 గంటలకు మెదక్‌నియోజకవర్గం, సాయంత్రం5 గంటలకు మల్కాజిగిరి పార్లమెంటరీ ని యోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే బుధవారం ఉద యం 11గంటలకు కరీంనగర్, మ ధ్యాహ్నం 2గంటలకు ఆదిలాబాద్, సా యంత్రం 5గంటలకు పెద్దపల్లి పార్లమెం ట్ల వారీగా నియోజకవర్గాల నేతలు, పా ర్టీ కేడర్‌తో ఆమె సమీక్ష చేయనున్నారు. ఇప్పటికే ఆమె పలు జిల్లాలో నెలకొన్న అంతర్గత విభేదాలు, పార్టీ పరిస్థితి గు రించి సర్వే నిర్వహించినట్టుగా తెలిసిం ది.ప్రస్తుతం జిల్లాల వారీగా ఇన్‌చార్జీ మంత్రులు, జిల్లాల మంత్రుల మధ్య ఉ న్న విభేదాలు, ఆయా జిల్లాలో కేడర్‌కు, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న పంచాయితీలపై ఒక నివేదిక సిద్ధం చేసుకున్నట్టుగా తెలిసింది.
నేటి నుంచి జరుగనున్న నియోజకవర్గాల సమీక్షకు ఆమె చేయించిన సర్వే ఆధారంగా వారికి పలు సూచనలు, సలహాలతో వారికి క్లాస్ తీసుకోనున్నట్టుగా తెలిసింది.వరుసగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు పూర్తయిన అనంతరం స్థా నిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ ఘన వి జయం సాధించేందుకు ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలపై ఆమె జిల్లాల వారీ గా చర్చించే అవకాముందని సమాచా రం. అదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వా న్ని లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్షాలు బిజె పి, బిఆర్‌ఎస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సమయంలో జిల్లాల్లో ని యోజకవర్గాల స్థాయిలో ఉన్న లోపాలను ఎలా సరిచేసుకొని ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలపై కూడా నియోజకవర్గాల సమీక్షలో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు పదవులు రాకుండా అసంతృప్తితో ఉన్న కేడర్‌లో సైతం ఉత్సాహాం నింపేలా ఆమె ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగా పార్టీ కోసం చాలా ఏళ్లుగా అహర్నిశలు శ్రమిస్తున్న కేడర్ వివరాలను కూడా ఆమె సేకరించినట్టుగా సమాచారం.
ఇలా వారికి కచ్చితంగా ఏదో పదవులను అప్పగించి పార్టీలో నూతనోత్తేజాన్ని నింపి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా ఆమె వ్యూహాలు రూపొందిస్తున్నట్టుగా తెలిసింది. ఎవరైనా పార్టీ పదవులు, ప్రభుత్వ పదవుల కోసం ఫైరవీలు చేస్తే వారికి ఎలాంటి పదవులు ఇవ్వమని ఆమె ఇప్పటికే సూచించడంతో పలువురు ఫైరవీకారులు అసంతృప్తికి లోనవుతున్నారు. నిజంగా ఇలాంటి చర్యలు చేపడితే రానున్న రోజుల్లో కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన ఫలితం దక్కుతుందని పార్టీ వర్గాల్లో ఆశలు వెల్లివిరుస్తున్నాయి.