ఛత్రపతి శంభాజీ మహారాజ్ అజేయమైన స్ఫూర్తిని, ధైర్యాన్ని సెలబ్రేట్ చేసుకునే చారిత్రక ఇతిహాసం ఛావా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. దినేష్ విజన్ మాడ్డాక్ ఫిలిమ్స్ నిర్మించి, లక్ష్మణ్ ఉకర్ దర్శకత్వం వహించిన చావాలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. హిందీ వర్షన్ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన తర్వాత ఈ పవర్‌ఫుల్ కథను తెలుగులోకి డబ్ చేసి మార్చి 7న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఛావా తెలుగు వర్షన్‌ను గీతా ఆర్ట్ డిస్ట్రిబ్యూషన్ విభాగం గీతా ఆర్ట్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
సోమవారం ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొని అలరించింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ “ఛావా సినిమాని మార్చి 7న తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా హిందీలో ఎంత పెద్ద ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలుసు. అంత మంచి సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఇది మామూలు సినిమా కాదు. మన చరిత్రని అద్భుతంగా చిత్రీకరించిన సినిమా. చాలా అద్భుతమైన ఘట్టాలతో ఈ సినిమా ఉంటుంది. ఇందులోని క్లైమాక్స్ చివరి 25 నిమిషాలు ఇండియా మొత్తం కళ్ల వెంబడి నీళ్లు పెట్టించింది. అంత మంచి చిత్రాన్ని మేము తెలుగులోకి తీసుకొస్తున్నాం”అని అన్నారు.