బెంగళూరు: ఓ సిఐఎస్‌ఎఫ్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ ఐటి ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టకొని అనంతరం మోసం చేయడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం మంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘాజిపురకు చెందిన అభిషేక్(40) చెన్నైలోని ఓ ఐటి కంపెనీలో పని చేస్తున్నాడు. సిఐఎస్‌ఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని అభిషేక్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి అభిషేక్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఆమెకు అప్పటికే వివాహం జరిగి ఉండడంతో పాటు తనతో లైంగిక అవసరాలు తీర్చుకుందని ఐటి ఉద్యోగి ఆరోపణలు చేశారు. మంగళూరులోని రావ్ సర్కిల్‌లో ఓ లాడ్డ్‌లో అభిషేక్ సింగ్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు ఆత్మహత్యకు ముందు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం కర్నాటకలోని మంగళూరులో విధులు నిర్వహిస్తోంది.