- Advertisement -
హైదరాబాద్: న్యూజిలాండ్‌లో ఆడుతున్నప్పుడు పాస్ట్ బౌలర్ షమీకి గాయకావడంతో అతడికి బదులుగా మరో పాస్ట్ బౌలర్‌ను తీసుకోవాలని స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే సూచించాడు. షమీ బౌలింగ్ చేసున్నప్పుడు ఇబ్బంది పడలేదని, కానీ ఆయన విశ్రాంతి ఇస్తే అర్ష్‌దీప్ లేదా హర్షిత్ రాణాను తీసుకోవచ్చన్నారు. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో నలుగురు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం అనేది మంచి నిర్ణయమని కొనియాడారు. 48 గంటలలో దుబాయ్ పిచ్ మారిపోతుందని తాను అనుకోవడంలేదన్నారు. న్యూజిలాండ్‌తో ఆడుతున్నప్పుడు పిచ్ ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంటుందని కుంబ్లే తెలియజేశారు. హర్ధిక్ పాండ్యాకు తోడు మరో పేసర్ ఉంటే సరిపోతుందని, మూడో పేసర్ అవసరం లేదన్నారు. స్పిన్నర్లతో 40 ఓవర్లు బౌలింగ్ చేయిస్తే బాగుంటుందని కుంబ్లే చెప్పారు. టీమిండియాకు బౌలింగ్ అప్షన్లు ఉండడంతో ఇబ్బందేమీ లేదన్నారు.
- Advertisement -