ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాల వ్యాప్తంగా ఒక వైపు సామాజిక కల్లోలాలు, జాతుల మధ్య దౌర్జన్యకాండలు, తిరుగుబాటు వర్గాలు, అధ్వాన మౌలిక వసతులు, కమ్యూనికేషన్, రో డ్డు పరిస్థితులను, మరొక వైపు ఈ ప్రాంతానికి అనేక కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులు తీసుకురావడం ద్వారా అభివృద్ధి చెందిన ఈశాన్య ప్రాంతం గురించి వచ్చే ప్రకటనలను పరిశీలించినప్పుడు ఈశాన్య భారతంలో అస్సాం, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రెండు పరస్పర విరుద్ధ దృశ్యాలు మనకు గోచరిస్తా యి. అస్సాంలోకి మరింతగా పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ఏడు సంవత్సరాల కాలంలోనే ‘అద్వాంజ్ అస్సాం 1.0, అడ్వాంజ్ అస్సాం 2.0’ పేరిట రెండు మెగా పెట్టుబడుల శిఖరాగ్ర సదస్సులు నిర్వహించారు.
అడ్వాంజ్ 1.0 శిఖరాగ్ర సదస్సును 2018లో నిర్వహించారు. మీడియా లో భారీ ఎత్తున ప్రచారంతో రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అనేక ఎంఒయులపై సంతకాలు చేశారు. అయితే, ఎన్ని ఎంఒయులు రాష్ట్రంలో చివరకు పెట్టుబడులు తీసుకువచ్చాయో మనకు తెలియదు. కొత్తగా భారీ పరిశ్రమలు, తయారీ ప్రాజెక్టులు మొదలైనవి ఏర్పాటు వంటి ప్రధాన పరిణామం ఏదీ మనకు కానరాలేదు. అండుకు భిన్నంగా ఇప్పటికే ఉన్న అనేక పరిశ్రమలు మూతపడడమో లేక మూసివేతకు సిద్ధంగా ఉండడ మో జరిగింది. మోడీ ప్రభుత్వం కింద భారతీయ ఆర్థి క వ్యవస్థ పరిస్థితి గడచిన 14 ఏళ్లలో మెరుగుపడలే దు. భారతీయ ఆర్థిక వ్యవస్థ నిరాశాజనక స్థితిలో ఉం దని వివిధ నివేదికలు సూచిస్తున్నాయి.
భారతదేశంలోని టాప్ 10 శాతం మంది 1990 లో జాతీయ ఆదాయంలో 34 శాతంపై ఆధిపత్యం వహించారని బ్లూమ్ వెంచర్స్ రూపొందించిన ‘సింధు లోయ వార్షి క నివేదిక 2025’ వెల్లడించింది. ఆ సంఖ్య 2025 నాటికి 57.7 శాతానికి పెరిగింది. వెంచర్ క్యాపిటల్ సంస్థ బ్లూమ్ వెంచర్స్ అధ్యయనాన్ని ఉటంకిస్తున్న మీడియా వార్తల ప్రకారం, దేశ జనాభాలో 90 శాతం మంది సుమా రు 100కోట్ల మంది భారతీయులకు వస్తువు లు లేదా సేవల కొనుగోలుకు విచక్షణాధికార వ్యయ శక్తి లేదు. ఆ నివేదికపై బిబిసి విశ్లేషణ ప్రకారం, ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ‘వినియోగ వర్గం’ పరిమాణంలో పెరగడం లేదు, కానీ, మరింతగా ధనవంతు లు అవుతున్నారు.
సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారని, ధనవంతుల మొత్తం సంఖ్య స్తంభన స్థితిలో ఉందని విదితం అవుతోంది. తాజా వినియోగం క్షీణత తీవ్రతరమైందని, ఇందుకు కొనుగోలు శక్తి తగ్గడమే కా కుండా, ఆర్థిక పొదుపు మొత్తాల్లో తగ్గుదల, సామూహిక రుణభారం పెరుగుదల కారణమని నివేదిక తెలిపింది. అటువంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ అస్సాంను, ఈశాన్య ప్రాంతాన్ని చైతన్యమంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎలా అభివృద్ధి చేస్తారో చూడవలసి ఉంటుంది. దేశంలోని అదానీ, అంబానీ, జిందాల్, చంద్రశేఖరన్ వంటి బడా పారిశ్రామికవేత్తలు భారీ పెట్టుబడులపై వాగ్దా నం చేయడానికి శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు.
అ స్సాంను వర్ధమాన పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దే కృషి లో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, వేదాం త, టాటా గ్రూప్ వచ్చే కొన్ని సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక వేల కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులకు వాగ్దానం చేశాయి.వారు అస్సాం ప్రభుత్వ మెగా పెట్టుబడి సమ్మిట్ ‘అద్వాంజ్ అస్సాం 2.0’లో భారీగా వాగ్దా నం చేసిన పారిశ్రామికవేత్తలు. చైనా, దక్షిణ కొరియా, తైవాన్, ఇండోనేషియా, సింగపూర్, మలేషియా నుంచి మడుపరుల ప్రతినిధులు కూడా సమ్మిట్‌లో పాల్గొన్నారు. అయితే, రాష్ట్రంలో అటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అదే మొదటి సారి కాదు.
దేశంలోని మెట్రోల్లో, విదేశాల్లోను ప్రభుత్వం అటువంటి సమ్మిట్‌లు పెక్కింటిని నిర్వహించింది. అటువంటి స మ్మిట్‌ల విజయాన్ని సూచించే ఎటువంటి గణాంకాలనూ ప్రభుత్వం బహిరంగ వేదికల్లో పొం దుపరచలేదు.‘ఇప్పుడు, అస్సాం ఆగ్నేయ ఆసియా కు, భారత్‌కు ప్రవేశమార్గం (గేట్‌వే)గా ఆవిర్భవిస్తోంది. సామర్థా న్ని మరింతగా పెంచడానికి ప్రభుత్వం ‘ఉన్నతి’ (అభివృద్ధి)గా కూడా పేర్కొంటున్న ఈశాన్య పరివర్తనాత్మక పారిశ్రామికీకరణ పథకం’ ను ప్రారంభించింది. ఈ పథకం అస్సాం సహా ఈశాన్య ప్రాంతం వ్యాప్తంగా పరిశ్రమలు, పెట్టుబడులను, పర్యాటకాన్ని పెంపొందిస్తుంది. ఈ పథకాన్ని, అస్సాం అపరిమిత అవకాశాలను ఉపయోగించుకోలసిందిగా ఇక్కడి పరిశ్రమ పెద్దలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
అస్సాం సహజ వనరులు, వ్యూహాత్మక స్థానం దీనిని ఇష్టపడే పెట్టుబడి గమ్యస్థానంగా చేస్తున్నా యి’ అని ప్రధాని సమ్మిట్‌లో చెప్పారు.అస్సాం ప్రభుత్వ పెట్టుబడి సమ్మిట్ ‘అద్వాంజ్ అస్సాం 2.0’కు ముందు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. భారత ఈశాన్య ప్రాంతానికి వ్యతిరేకంగా జారీ చేసిన పర్యాటక సలహా పత్రాలను సమీక్షించవలసిందిగా దేశాలకు నచ్చజెప్పేండుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలియజేశారు. అస్సాంను భారతదేశంలోని ఇతర ఈశాన్య రాష్ట్రాలతో ‘కలపరాదు’ అని, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి ఆ సలహా పత్రాలు అవరోధాలు అని హిమంత శర్మ శనివారం వాదించారు. ‘పర్యాటక వ్యతిరేక సలహా పత్రాన్ని ఉపసంహరించనిదే విదేశీ పెట్టుబడులు సాధ్యం కావు.
ఎవరైనా రాష్ట్రానికి స్వేచ్ఛగా రాలేకపోతే వారు ఇక్కడ ఎలా మదుపు చేస్తారు? విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ చొరవలు, నా వ్యక్తిగత చర్చల ద్వారా జపాన్, ఆస్ట్రేలియా దౌత్య కార్యాలయాలు ఇప్పటికే చర్యలు తీసుకున్నాయి’ అని అస్సాం ముఖ్యమంత్రి పేర్కొన్నారు.కల్లోలిత సాంఘిక, రాజకీయ పరిస్థితులు, తిరుగుబాటు వర్గాల చర్యలు మొదలైనవాటి కారణంగా భారత ఈశాన్య ప్రాంత రాష్ట్రాలను సందర్శించవద్దని యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ దేశాలతో సహా అనేక పాశ్చాత్య దేశాలు సలహా పత్రాలు విడుదల చేశాయి.
భారత్‌లోని అన్ని ప్రాం తాల పరిస్థితి మదింపునకు ఆ దేశాలకు సొంత నెట్‌వర్క్‌లు ఉన్నాయి. అవి రాజకీయ నాయకుని విజ్ఙప్తి ఆధారంగా పర్యాటక సలహా పత్రాన్ని రూపొందించవు. ‘కల్లోలిత ప్రాంతాల్లో’ శాంతి భద్రతల పరిరక్షణకు సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం 1958ని ఈశాన్య ప్రాంతంలోని అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారన్నది వాస్తవం. అస్సాంలోని పలు ప్రాంతాల్లో ఆ చట్టం ఇప్పటికీ అమలులో ఉన్నది. 2023 మేలో మొదలైన, 21 నెలలు సుదీర్ఘంగా జాతుల మధ్య హింసాత్మక సంఘటనలు సాగిన తరువాత మణిపూర్‌ను రాష్ట్రపతి పాలన కిందకు తీసుకురావలసి వచ్చింది.
ఉగ్రవాదం, తిరుగుబాటు వర్గాల ముప్పు కారణంగా ఈ దిగువ రాష్ట్రాలు: అస్సాం, మణిపూర్‌లకు అత్యవసరం కాని ప్రయాణాలు తప్పించుకోవలసిందిగా తమ దేశ పౌ రులకు కెనడా ప్రభుత్వం సలహా పత్రం జారీ చేసింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ పౌరులకు జారీ చేసిన సలహా పత్రంలో భారత్‌లోని అటారివాఘా సరిహద్దు, ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాలునాగాలాండ్ సరిహద్దు ప్రాంతా లు, అస్సాంలోని తీన్‌సుకియా, దిబ్రూగఢ్, చరాయిదేవ్, శివసాగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల గురించిన ప్రస్తావన ఉన్నది. భారత్‌లో ప్రయాణానికి సంబంధించి తాజాగా అప్‌డేట్ చేసిన యుఎస్ సలహా పత్రం ఉగ్రవాదం, తిరుగుబాటు వర్గాల ముప్పు కారణంగా మణిపూర్‌కు, అస్సాంలోని కొన్ని ప్రాంతాలకు అత్యవసరం కాని ప్రయాణాన్ని మానుకోవలసిందని సూచిస్తోంది.
యుకె ప్రభుత్వ సలహా పత్రం ఇలా పేర్కొంటున్నది: ఈశాన్య భారతంలోని అంత ర్ రాష్ట్ర సరిహద్దుల పొడుగునా అకస్మాత్తుగా అల్లర్లు, ఘర్షణలు సంభవించవచ్చు, ఈశాన్య రాష్ట్రాలు కొన్నిటిలో హింసాత్మక సంఘటనలు ఉండవచ్చు. ఆ ప్రాంతం లో పర్యటించే ముందు స్థానిక అధికారులను దయచేసి సంప్రదించండి. అస్సాం, మిజోరామ్ మధ్య, అస్సాంమేఘాల య వివాదాస్పద సరిహద్దు పొడుగునా మరణాలకు దారి తీసిన దౌర్జన్యపూరిత ఘర్షణలు జరిగాయి. త్రిపురలో మతపరమైన, రాజకీయ సంఘర్షణలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. మయన్మార్ సరిహద్దు సమీపంలో నాగాలాండ్‌లో పలువురు పౌరులను భద్రతా దళాలు హతమార్చా యి. భారత్‌బంగ్లాదేశ్ సరిహద్దులో సంఘర్షణలు సంభవించాయి.
ఆ ప్రాంతాలను సందర్శించే ముందు ప్రయాణించడం సురక్షితమేనా అన్నది స్థానిక అధికారుల వద్ద తేల్చుకోవాలని ప్రయాణికులకు సలహా ఇవ్వడమైనది. భారత ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు, భారీగా జన సమీకరణలు సర్వసాధారణం. ముందస్తు హెచ్చరిక లేకుండా అవి సం భవించవచ్చు, అప్పుడప్పుడు శాంతి భద్రతలకు విఘా తం కలగవచ్చు. నిరసన ప్రదర్శనల జోలికి వెళ్లవద్దు, జనం గుమిగూడితే సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోండి, మీ భద్రత ఏర్పాట్లను జాగ్రత్తగా సమీక్షించం డి, స్థానిక అధికారుల సలహా పాటించండి. వివిధ దేశాలు జారీ చేస్తున్న ఆ ప్రయాణ సలహా పత్రాలను ఎవ్వరూ తోసిపుచ్చజాలరు.
తిరుగుబాటు ధోరణులు, సాంఘిక అల్లర్లు మొదలైనవాటి కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధికి విఘాతం కలిగిందని కేంద్రంలోని అధికార పార్టీ నేతలు ఆరోపించా రు. అయితే, ఆ ప్రాంతంలో అభివృద్ధి లేమి సాంఘిక అల్ల ర్లు, తిరుగుబాటు ధోరణులకు దారి తీసిందన్నది వాస్తవం. ‘అడ్వాంటేజ్ అస్సాం 2.0’ మెగా కార్యక్రమం లక్షం 2026 మేలో జరగవలసి ఉన్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలే తప్ప వేరేమీ కాదు. అస్సాంలోని 800 పైచిలుకు తేయాకు తోటల్లో పని చేసే ఆదివాసీ వోటర్లను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ సమ్మిట్ ప్రధాన కార్యక్రమంలో భాగం 8600 మంది నర్తకులతో ఒక మెగా నృత్య ప్రదర్శన నిర్వహించింది. ఎన్నికల్లో ఆ ఆదివాసీ వోటర్ల మద్దతు ప్రభుత్వానికి అవసరం. ఆ మెగా నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్నవారందరికీ ఒక్కొక్కరికి రూ. 25 వేలు చెల్లిస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ హాస్యాస్పద కార్యక్రమాలకు పెట్టుబడితో గాని, అభివృద్ధితో ఏమాత్రం సంబంధం లేదు. రాష్ట్ర ఖజానా నుంచి డబ్బు ఖర్చు చేయడం ద్వారా వోట్ల కొనుగోలుకు అది మరొక మార్గం మాత్రమే.
– గీతార్థ పాఠక్