Tuesday, March 4, 2025

మామునూర్ ఎయిర్‌పోర్ట్.. అధికారులను అడ్డుకున్న రైతులు

- Advertisement -
- Advertisement -

వరంగల్: మామునూర్‌లో విమానాశ్రయ నిర్మాణానికి కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటివరకూ ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న భూమితో పాటు.. మరింత భూమిని సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే.. అధికారులు చేపట్టిన భూసేకరణని రైతులు అడ్డుకున్నారు.

నక్కలపల్లి, గుంటురుపల్లి, నల్లకుంట, గాడిపెల్లి గ్రామాలకు చెందిన భూనిర్వాసితులు నిరసనకు దిగారు. ‘జై జవాన్.. జై కిసాన్’ అంటూ 200 రైతులు ఆందోళన చేపట్టారు. సర్వేను ఆపేసి వెళ్లిపోవాలి అంటూ ఆర్డివొ సత్యపాల్ రెడ్డి, తహషీల్దార్ నాగేశ్వర్ రావుతో సహా రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. మార్కెట్‌ ధరకి తగినట్టు పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని.. తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యమ్నాయం చూపించాలని వాళ్లు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు. ఇక్కడ ధర్నాకు అనుమతి లేదని.. ఆందోళన విరమించాలని రైతులకు సూచించారు. అయినా రైతులు ఆందోళన విరమించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News