Tuesday, March 4, 2025

హిమానీ ప్రాణం తీసిన స్నేహితుడు

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమానీ నర్వాల్ హత్య కేసులో సచిన్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలోని రోహ్‌తక్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రోహ్‌తక్‌లోని తన పూర్వీకుల ఇంట్లో హిమానీ నర్వాల్ లా ఉంటూ కాలేజీలో లా చదువుతోంది. కాంగ్రెస్ పార్టీలో చురకైన కార్యకర్తగా వ్యవహరించేంది. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి రోహ్‌తక్‌లో పాదయాత్ర చేశారు. సోషల్ మీడియాలో హిహానీకి సచిన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.

ఝుజ్జర్ లో సచిన్ మొబైల్ షాను నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పరిచయం ఇద్దరు మధ్య స్నేహంగా మారింది. ఫిబ్రవరి 27న సచిన్ ఆమె ఇంటికి వచ్చాడు. ఇద్దరు మధ్య గొడవ జరగడంతో తారాస్థాయికి చేరుకుంది. దీంతో అతడు మొబైల్ ఛార్జింగ్ వైర్ ఆమెను ఉరి పెట్టి చంపారు. ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి ఆటోలో తరలించి నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. ఆమె ఇంట్లో నుంచి బంగారు ఆభరణాలు, ల్యాప్ టాప్, స్కూటర్ ను తీసుకెళ్లాడు. మృతదేహం హిమానీది అని తెలిసిన విచారణలో సచిన్ అదుపలోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా తానే హత య చేశానని ఒప్పుకున్నాడు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డబ్బుల విషయంలో గొడవలో జరగడంతో ఆమెను అతడు చంపినట్టు పోలీసులకు వివరణ ఇచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News