- Advertisement -
అమరావతి: వైసిపి ఆరోపణలపై తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అన్నారు. విసిల రాజీనామా అంశంపై మండలిలోవాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. బెదిరించినట్లు అనే పదం.. విసిల రాజీనామా లేఖల్లో ఎక్కడా లేదని, వైసిపి నియమించిన విసిలకు ఇంగ్లీష్ లో బేసిక్ గ్రామర్ కూడా రాదని లోకేష్ విమర్శిచారు. విసిల రాజీనామా లేఖల్లో బెదిరించి నట్లు ఆరోపణలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రాజీనామా చేసిన ఒక విసి రాజారెడ్డి చెల్లెలి కోడలు విసి ప్రసాద్ రెడ్డి, వైసిపి కార్యకర్త నని తెలిపారు. పార్టీ కోసం సర్వేలు చేయించిన ఘనత ఆనాటి విసిలదే నని మంత్రి లోకేష్ మండిపడ్డారు.
- Advertisement -