Tuesday, March 4, 2025

తొలి సెమీఫైనల్.. విధ్వంసకర హెడ్‌ను ఔట్ చేసిన వరుణ్

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న తొలి సెమీఫైనల్‌లో భారత బౌలర్ వరుణ్ చక్రవర్తి మరోసారి తన సత్తాను చాటాడు. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్‌ని పెవిలియన్‌కు చేర్చి భారత్‌కు ఊరట కల్పించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో షమీ వేసిన 3వ ఓవర్‌లోనే ఆస్ట్రేలియా ఓపెనర్ కూపర్(0) రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ చెలరేగిపోయాడు. వరుసగా ఫోర్లు, సిక్సులతో భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ దశలో వరుణ్ చక్రవర్తిని బరిలోకి దించాడు కెప్టెన్ రోహిత్. వరుణ్ మొదటి ఓవర్ రెండో బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించిన హెడ్(39) శుభ్‌మాన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్మిత్(19), లబుషేన్‌(2) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News