Tuesday, March 4, 2025

రష్యాకు లొంగిపోయేలా చేయడానికే మిలిటరీ సాయం నిలిపివేత : కీవ్

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అగ్రరాజ్యం తమకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు క్రమంగా తమ దేశాన్ని రష్యాకు లొంగిపోయేలా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టు ఉన్నాయని ఆ దేశ పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల కమిటీ చీఫ్ మెరెజ్‌కో ఆరోపించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మధ్య వాగ్వాదం నెలకొన్న నేపథ్యంలో కీవ్‌పై ఒత్తిడి తీసుకురావడానికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని యూరోపియన్ దేశాలు ఆరోపించాయి.

అగ్రరాజ్యం సాయం లేకుండా కీవ్ రష్యాతో పోరాటం చేయగలదా ? అని ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రకటన వెలువడిన అనంతరం ఐరోపా దేశాల నేతలు అత్యవసర చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. జర్మనీ తదుపరి ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఫ్రెడరిక్ మెర్జ్ అమెరికా ప్రకటనను వ్యతిరేకించారు. ట్రంప్ నిర్ణయం ఉక్రెయిన్ రక్షణ ప్రయత్నాలను మరింత బలపరిచే ఉద్దేశ పూర్వక చర్చగా ఉందని అన్నారు. ఈ నిర్ణయం వల్ల ఉక్రెయిన్‌కు ఇప్పటికే అందుబాటులో ఉన్న వందల మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలపై ప్రభావం పడనుందని ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News